వైఎస్‌ఆర్‌సిపితోనే నవరత్నాలు సాధ్యం

Navaratnam is possible with YSRCP
Date:19/11/2018
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డితోనే నవరత్నాలు కార్యక్రమాలు సాధ్యమౌతుందని వైఎస్ఆర్సిపి జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి, కౌన్సిలర్ రేష్మా హబిబ్ , మున్సిపాలిటి బూత్‌కమిటి మేనేజర్ , కౌన్సిలర్ అమ్ము, నియోజకవర్గ బూత్ కమిటి మేనేజర్ రెడ్డెప్ప , కో-ఆఫ్షన్‌మెంబర్ ఖాదర్‌బాషాలు తెలిపారు. సోమవారం వీరందరు విడి విడిగా పలు ప్రాంతాలలో నవరత్నాల కార్యక్రమాలను ప్రచారం చేపట్టారు. పట్టణంలోని ఎన్ఎస్.పేటలో రేష్మా ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. కౌన్సిలర్ అమ్ము ఆధ్వర్యంలో ఉబేదుల్లాకాంపౌండులోని కూరగాయల సంతలో నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే మండలంలోని గుడిసెబండ పంచాయతీలోని నక్కబండ గ్రామంలో బూత్‌కమిటి మేనేజర్ రెడ్డెప్ప , కో-ఆఫ్షన్మెంబరు ఖాదర్‌బాషాలు కరపత్రాలను పంపిణీ చేసి, ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , మాజీ ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి సూచనల మేరకు ప్రతి రోజు నవరత్నాలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులను చేసేందుకు వార్డులలోను, గ్రామాలలోను ప్రచారం చేపడుతున్నట్లు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం పేద ప్రజలను మోసగించి, అధికారం రాగానే ప్రజలను విస్మరించిందన్నారు. ప్రజా సంక్షేమం పట్టని పార్టీకి ప్రజలు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పథకాలను కొనసాగించాలంటే వైఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఖాన్, జలీల్, మహమ్మదాలి, షామీర్, బావాజాన్, జావీద్, మన్సూర్, జాకీర్ అహ్మ్రద్, ఫయాజ్, ఖాజా, మమ్ముకుట్టి, సూరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పరమేశ్వర ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు
Tags; Navaratnam is possible with YSRCP