నవ చైతన్యం తీసుకొచ్చేందుకే నవరత్నాలు

Navaratnam is to bring the new consciousness

Navaratnam is to bring the new consciousness

Date:24/11/2018

– జెడ్పిటీసీ వెంకటరెడ్డి యాదవ్‌

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలో నవ చైతన్యం తీసుకొచ్చేందుకు నవరత్నాలు కార్యక్రమాన్ని వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారని ఎంపిపి నరసింహులు, వైఎస్‌ఆర్‌సిపి జెడ్పి ప్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని బాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని సింగిరిగుంట పంచాయతీలో నవరత్నాలపై ప్రచార కార్యక్రమాన్ని నియోజకవర్గ బూత్‌కమిటి మేనేజర్‌ రెడ్డెప్ప ఏర్పాటు చేశారు. అలాగే మున్సిపాలిటిలో బూత్‌కమిటి మేనేజర్‌ , కౌన్సిలర్‌ అమ్ము పట్టణంలోని పండ్ల వ్యాపారులతో సమావేశమై , నవరత్నాలు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు నవరత్నాలపై చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగన్నర సంవత్సరాలు గడుస్తున్నా పేదల సంక్షేమం పట్టించుకోలేదన్నారు. రుణాల మాఫి, నిరుద్యోగ భృతి పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసగిస్తుందన్నారు. వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి దమ్మున్న నాయకుడని , ఆయన ఎన్నికల మ్యానిఫెస్టోతో రాష్ట్ర ప్రజల అభివృద్ధి ఊహించలేమన్నారు. రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పాలనను తిరిగి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కో-ఆఫ్షన్‌మెంబర్‌ ఖాదర్‌బాషా , పార్టీ నేతలు రాజశేఖర్‌రెడ్డి, సుబ్బన్న, రెడ్డెప్ప, నాగభూషణం, రంగ, ఆంజప్ప, శంకరప్ప, పట్టణ వ్యాపారులు మహమ్మద్‌, ఆసిఫ్‌, అఫ్సర్‌, మంజునాథ్‌, భక్షు, ఎస్‌.మహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

చింతకాని మండలంలో భట్టీ ప్రచారం

Tags; Navaratnam is to bring the new consciousness

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *