నవరత్నాలు – సంక్షేమ క్యాలండర్ వారీగా లబ్దిదారులకు ద్వై – వార్షిక నగదు జమ, లబ్దిదారులకు పథకాల మంజూరు

జిల్లాలో కొత్తగా 3466 లబ్దిదారులకు వివిధ సంక్షేమ పథకాల కింద 2.89 కోట్ల లబ్ది మరియు మెగా చెక్ పంపిణీ
: జిల్లా కలెక్టర్

తిరుపతి ముచ్చట్లు:

 

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నవరత్నాలు ఈ ఆర్థిక సంవత్సరం 2022-23 మొదటి దఫా జూలై మాసంలో సంక్షేమ క్యాలెండర్ మేరకు అర్హతగల లబ్దిదారులకు నేడు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని కలెక్టర్లతో పాటు వివిధ సంక్షేమ అధికారులతో ముఖా ముఖీ నిర్వహించి కంప్యూటర్ బటన్ నొక్కి ఏ కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలు అందుకోలేక పోయిన అర్హులకు మళ్లీ అవకాశం ఇచ్చి వెరిఫై చేయించి రాష్ట్ర వ్యాప్తంగా 3,39,096 మందికి నేడు రూ. 136.92 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా పెన్షన్లు 2,99,085 మందికి ఏటా 935 కోట్ల అదనపు వ్యయంతో వై యస్ ఆర్ పెన్షన్ కానుక, ఇప్పుడు కొత్తగా 7051 బియ్యం కార్డులతో  కలిపి 1,45,47,036 నేటి వరకు మంజూరు అయినవి మరియు 3,035  మందికి కొత్తగా డా. వై యస్ ఆర్ ఆరోగ్యశ్రీ కలిపి నేటి వరకు 1,41,12,752 మందికి ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేసి, లబ్ది చేకూరుస్తున్నామని  ముఖ్యమంత్రి కలెక్టర్లను లబ్ధిదారులను ఉద్దేశించి తెలిపగా, మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి, సంబంధిత సంక్షేమ శాఖ అధికారులతో,లబ్దిదారులతో కలిసి పాల్గొన్నారు.

 

 

ఈ కార్యక్రమం వీక్షించిన అనంతరం,  కలెక్టర్ మాట్లాడుతూ అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్దిదారులు కంగారు పడాల్సిన అవసరం లేకుండా, వారికి మరో అవకాశం కల్పిస్తూ సంక్షేమ పథకం లబ్ది అందించిన నెలలోపు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అర్హులైన వారికి డిసెంబర్ నుండి మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిని జూన్ నెల ముగిసిన వెంటనే.. జూన్ నుండి నవంబర్ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిని డిసెంబర్ నెలలో అందచేస్తున్నదనీ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ వార్డు సచివాలయం లో లబ్దిదారుల జాబితాలు ప్రదర్శించి సోషల్ ఆడిట్ నిర్వహించి పారదర్శకత తో లంచాలకు తావు లేకుండా, కుల మతాలకు వర్గ పార్టీల వివక్షకు తావు లేకుండా అర్హులందరికీ నూటికి నూరు శాతం సంతృప్తి స్థాయిలో అందచేస్తున్న ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం అని తెలియ చేసారు.  వివిధ పథకాలు ఇబిసి నేస్తం , జగనన్న చేదోడు , వైఎస్సాఆర్ మత్స్యకార భరోసా , రైస్ కార్డులు , పింఛను కార్డులు , ఆరోగ్యశ్రీ , 90 రోజుల్లో ఇంటి పట్టాల తదితర లబ్ధిదారులు  నేడు ఈ కార్యక్రమం ద్వారా లబ్ది పొందుతున్నారని తెలిపారు.

 

ప్రతి సంవత్సరం అందించే నవరత్నాలకు సంబంధించి ద్వై – వార్షిక పథకాల లబ్దిదారుల ఎంపిక తిరుపతి జిల్లాకు సంబంధించి డి ఆర్ డి ఏ మరియు వై యస్ ఆర్ క్రాంతి పథకం కింద నూతన పెన్షన్లు 13,448 కి రూ 3.485 కోట్లు, మెప్మా వై యస్ ఆర్ సున్న వడ్డీ కింద 1946 ఎస్ హెచ్ జి లకు రూ 1.58 కోట్లు, వై యస్ ఆర్ మత్స్యకార భరోసా కింద 282 మందికి రూ 28.20 లక్షలు నూతనంగా లబ్ది చేకూరుతోందని తెలిపారు.  అనంతరం 3466 మంది లబ్ధిదారులు అర్హత కలిగియున్న వారికి రూ. 2,89,18,673 నేరుగా వారి ఖాతాల్లోకి పారదర్శకంగా ముఖ్యమంత్రి జమ చేశారని తెలుపుతూ, మెగా చెక్ ను, కొంతమంది లబ్దిదారులకు సంక్షేమ శాఖల ప్రొసీడింగ్స్ ప్రతులను జిల్లా కలెక్టర్ అందించారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పథక సంచాలకులు ప్రభావతి, మెప్మా పి డి రాధమ్మ, జిల్లా పంచాయతీ అధికారి రూప రాణి, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాస్ నాయక్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఉదయ భాస్కర్, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య తదితర సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

 

Tags: Navaratnas – bi-annual cash deposit to beneficiaries as per welfare calendar,
Grant of schemes to beneficiaries

Leave A Reply

Your email address will not be published.