తెలంగాణలో వైభవంగా నవరాత్రులు

Date:13/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ జిల్లాల్లో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.  నిర్మల్ జిల్లా బాసరలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు కూష్మాండదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.  అమ్మవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోదావరి తీరాన సామూహిక కుంకుమార్చనలు, వేదపీఠం ఆధ్వర్యంలో రుషికన్యలతో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.
అమ్మవారికి వేకువజామున మంగళ వాయిద్య సేవ, మంత్ర పుష్పం పూజలు నిర్వహించారు. వేకువజామున విఘ్నేశ్వర పూజ, సరస్వతీ పూజ నిర్వహిస్తున్నారు. ఉదయం  చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. అమ్మవారి యాగశాలలో మహా చండీయాగం, మధ్యాహ్నం ఒంటి గంటకు మహానివేదన, మంగళ హారతి,నిర్వహించారు.
భద్రాద్రిలో కుడా  శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనవారం  ధనలక్ష్మీ అలంకారంలో లక్ష్మీతాయారు అమ్మవారు దర్శనమిచ్చారు.  లక్ష్మీతాయారు అమ్మవారికి ఉదయం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మహిళలచే సామూహిక కుంకుమార్చనలు, శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం నిర్వహించారు. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కూష్మాండ అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం కలిగింది.
Tags: Navaratri is the exposition in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *