యోగా భ్యాసం వైపు నవతరం మళ్లాలి-ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

శారీరక దృఢత్వం కోసం చేసే వ్యాయామం కంటే యోగాభ్యాసమే ఉత్తమమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుచేత యోగాభ్యాసం వైపు నవతరం మళ్లాలని భూమన పునరుధ్ఘాటించారు. స్థానిక గెస్ట్ లైన్ హోటల్ సమీపం వద్ద యోగకేంద్రం లో మంగళవారం ఇంటర్నేషనల్ యోగా రోజు సందర్బంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని భూమన ప్రసంగించారు. యోగాభ్యాస సాధన వల్ల శారీరక, మానసిక రుగ్మతలు దరిచేరవని తెలిపారు. శరీరం, మనస్సు అదుపులో ఉంటాయన్నారు. తిరుపతి పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి మాట్లాడుతూ యోగాభ్యాసన్ని ప్రతి ఒక్కరూ అలవరుచు కోవాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మునిరెడ్డి, డాక్టర్ సిద్దమ్మ, రామిరెడ్డి పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Navataram Mallali-MLA Bhumana Karunakara Reddy towards yoga practice

Post Midle
Natyam ad