ప్రధానితో నవీన్ భేటీ

Naveen Bhatti with Prime Minister

Naveen Bhatti with Prime Minister

Date:11/06/2019

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

 

దేశ ప్రధాని నరేంద్ర మోదీతో బీజూ జనతా దళ్‌ అధ్యక్షుడు, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ సమావేశమయ్యారు. మోదీతో భేటీ ముగిసిన అనంతరం నవీన్‌ పట్నాయక్‌ మీడియాతో మాట్లాడారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలిపానని చెప్పారు. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. ఇటీవల తుపాను ధాటికి

ఒడిశా తీవ్రంగా నష్టపోయిందని నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు.ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఢిల్లీకి చేరుకున్న పట్నాయక్ సార్వత్రిక

ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన మోదీకి శుభాకాంక్షలు చెప్పారు. ఇటీవల వచ్చిన ఫొని తుపాను కారణంగా ఒడిశా తీవ్రంగా నష్టపోయిందని పట్నాయక్ మోదీ దృష్టికి తీసుకొచ్చారు.తమ రాష్ట్రం

ఆర్థికంగా వెనుకపడి ఉందన్నారు. కాబట్టి ఒడిశా శరవేగంగా అభివృద్ధి సాధించేందుకు వీలుగా ప్రత్యేక హోదాను ఇవ్వాలని కోరారు. ఓవైపు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్

ప్రధాని మోదీని కోరుతున్న నేపథ్యంలో పట్నాయక్ కూడా అదే పాటను అందుకోవడం గమనార్హం.ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల్లో ఒడిశాలోని 21 స్థానాలకు గానూ పట్నాయక్ నేతృత్వంలోని

బిజూజనతాదళ్ 12 సీట్లు దక్కించుకోగా, బీజేపీ 8 స్థానాలతో రెండో స్థానంలో, కాంగ్రెస్ ఓ సీటుతో మూడోస్థానంలో నిలిచాయి. అలాగే 147 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీలో బీజూ జనతాదళ్ అభ్యర్థులు

112 స్థానాల్లో ఘనవిజయం సాధించారు.

బ్రిటన్ కోర్టుకు నీరవ్

Tags:Naveen Bhatti with Prime Minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *