27న నవీన్ చంద్ర “హీరో హీరోయిన్” చిత్రం

Naveen Chandra's "Hero Heroine" movie on the 27th

Naveen Chandra's "Hero Heroine" movie on the 27th

Date:06/12/2019

స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్లుగా ‘అడ్డా’ చిత్రం దర్శకుడు జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాత భార్గవ్ మన్నె నిర్మిస్తున్న చిత్రం “హీరో హీరోయిన్”. ఈ సినిమా టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాల పైరసీ నేపథ్యంలో సాగే కథ కావడంతో ప్రతీ ప్రేక్షకుడు ఈ చిత్రం టీజర్ కు బాగా కనెక్ట్ అయ్యారు. పైరేటెడ్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 27న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత భార్గవ్ మన్నె మాట్లాడుతూ.. దర్శకుడు జి. కార్తీక్ రెడ్డి మంచి కథ చెప్పారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంశాలు పుష్కలంగా ఉండటమే కాకుండా, సరి కొత్త పాయింట్ తో ఈ చిత్రం ఉంటుంది. సినిమా పైరసీ నేపథ్యంలో సాగే ఇంట్రస్టింగ్ స్టోరీ ఇది. ఈ చిత్రం టీజర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కరెంట్ ట్రెండ్ కి తగ్గ కథ ఇది. హీరో నవీన్ చంద్ర పెర్ ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది. డైరెక్టర్ జి.కార్తీక్ రెడ్డి అనుకున్న పాయింట్ ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు.  సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. కష్టపడే టీమ్ కుదిరింది. మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ చిత్రాన్ని మా బ్యానర్ ద్వారా అందిస్తున్నాం. ఈనెల 27న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం. అనిఅన్నారు. నటీనటులు నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, డింపుల్ చొపాడియా, పోసాని కృష్ణ మురళి, 30 ఇయర్స్ పృథ్వి, అభిమన్యుసింగ్, జయప్రకాశ్, గౌతమ్ రాజు, శివన్నారాయణ, బమ్ చిక్ బబ్లూ.

 

ఎన్ కౌంటర్ పై హర్షాతిరేకాలు

 

Tags:Naveen Chandra’s “Hero Heroine” movie on the 27th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *