2000  మార్చి 5 నుంచి సీఎంగానే నవీన్….

Date:24/05/2019

భువనేశ్వర్ ముచ్చట్లు:

ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. 70 రోజులపాటు సాగిన ఎన్నికల హడావుడి దాదాపు ముగింపుకి వచ్చింది. కేంద్రంలో కమలం మరోసారి వికసించగా.. ఏపీలో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 2014లో గెలిచిన టీడీపీ ఈసారి బొక్కబోర్లాపడింది. ఒకసారి గెలిచిన పార్టీని మరోసారి గెలిపించడానికి ప్రజలు సుముఖంగా లేరని దీన్ని బట్టి అర్థం అవుతోంది. ఒకే పార్టీని వరుసగా రెండుసార్లు గెలిపించే సంప్రదాయానికి ఏపీ ప్రజలు వీడ్కోలు పలికారు. నచ్చకపోతే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. కానీ పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో నవీన్ పట్నాయక్ వరుసగా ఐదోసారి సీఎం అయ్యారు. ఒడిశాలో 146 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఆయన పార్టీ బిజూ జనతాదళ్ 113 స్థానాల్లో గెలిచి మరోసారి సత్తా చాటిందివరుసగా ఐదోసారి అధికారంలోకి రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ నవీన్ పట్నాయక్‌ పట్ల గ్రామీణ ప్రాంత ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అమితమైన ఆదరణ ఉంది. అందుకే 2000, మార్చి 5 నుంచి ఇప్పటికీ ఆయనే సీఎం, మరో ఐదేళ్లు కూడా పట్నాయక్‌దే ముఖ్యమంత్రి పీఠం. నవీన్ పట్నాయక్ తండ్రి బిజూ పట్నాయక్ రెండు పర్యాయాలు ఒడిశా సీఎంగా వ్యవహరించారు. తండ్రి మరణం తర్వాత 1997 డిసెంబర్ 26న ఆయన బిజూ జనతాదళ్ పేరిట నవీన్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. తండ్రి స్థానంలో అస్కా లోక్ సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఎంపీగా గెలుపొందారు. 2000 సంవత్సరంలో బీజేడీ అసెంబ్లీ ఎన్నికలకు పోటీచేసి విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లోనూ బీజేడీదే హవా.

 

 

 

 

నవీన్ పట్నాయక్ చాలా సింపుల్‌గా ఉంటారు. అవినీతికి ఆమడ దూరం. ఆయనెంత సింపుల్‌గా ఉంటారంటే.. పట్నాయక్ దగ్గర ఉండేవి రెండు జతల బట్టలు, స్లిప్పర్లు మాత్రమే. ఎలాంటి హంగు ఆర్భాటాల జోలికి వెళ్లరు. తనెంటో తన రాష్ట్రం ఏంటో.. అంతే అనవసర వ్యవహారాల్లోకి తలదూర్చరు. తరచూ విపత్తుల బారినపడి తీవ్రంగా నష్టపోయే ఒడిశా ఆయన పాలనలో విపత్తులను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంది.ఒడిశా బయటే పెరగడంతో నవీన్ పట్నాయక్‌కు తన మాతృభాష ఒడియా రాదు. ఎన్నికల ప్రచార సభల్లో పట్నాయక్ తన స్పీచ్‌ను ఇంగ్లిష్‌లో రాసుకొని మాట్లాడుతుంటారు. భాష రాకపోవడం ఆయనకు ఓ రకంగా ప్లస్ అయ్యింది. ఆయన ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకపోవడానికి ఒడియా రాకపోవడం కూడా ఓ కారణమే. భాష రానప్పటికీ.. ఒడిశా ప్రజలు ఆయన్ను ఓడించడానికి కారణం ఆయన వ్యక్తిత్వం, రాష్ట్రం పట్ల ప్రేమే. ఇటీవల ఫణి తుఫాన్ కారణంగా ఒడిశా నష్టపోతే.. సీఎంగా తన ఏడాది జీతాన్ని విరాళంగా ఇచ్చేశారు. మంచి మనసున్న నేత కాబట్టే జనం ఆయనకు పట్టం కడుతున్నారు.

 

కొంప ముంచిన నివేదికలు

Tags: Naveen is a CEO from March 5, 2000.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *