రామసముద్రం చేరుకున్న నవోదయ విద్యార్థి

రామసముద్రం ముచ్చట్లు:

మదనపల్లె జవహార్‌ నవోదయలో 8వ తరగతి పూర్తి చేసుకుని 9వ తరగతి కోసం మైగ్రేషన్‌తో బిహార్‌ రాష్ట్రం సంస్థిపూర్‌ జిల్లాకు వెళ్లిన దినేష్‌కుమార్‌ మృతదేహాం స్వగ్రామమైన రామసముద్రం మండలం పోతురాజుపల్లెకు చేరుకుంది. గత మూడు రోజుల క్రితం బిహార్‌ రాష్ట్రం సంస్థిపూర్‌ జిల్లాకు చదువుకోసం వెళ్లిన దినేష్‌ కుమార్‌ మృతి చెందాడు. ఈ నేపధ్యంలో దినేష్‌ కుమార్‌ మృతదేహాన్ని విమానంలో బెంగళూరుకు తరలించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన స్వగ్రామమైన రామసముద్రం మండలం కాప్పల్లె పంచాయతీ పోతురాజుపల్లె గ్రామానికి తరలించారు. మృతదేహాన్ని చూస్తునే పోతురాజుపల్లె గ్రామంలో శోకసముద్రంలో మునిగిపోయింది. చదువుకోసం వెళ్లిన కుమారుడు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. కన్న బిడ్డ చదువుకోసం ఇతర  రాష్ట్రా లకు వెళ్లి హఠాన్మరణం చెందడంతో తల్లిదండ్రులు సోకించడంతో చుట్టు ప్రక్కన ప్రజలు వారి ఆవేదన చూసి తట్టుకోలేకపోయారు. ఎస్‌ఐ రవీంద్రబాబు తన సిబ్బందితో పోతురాజుపల్లె గ్రామానికి చేరుకుని సంతాపం వ్యక్తం చేశారు.

Tags: Navodaya was a student who reached Ramasamudra

Leave A Reply

Your email address will not be published.