నవరాత్రి 2022 ప్యాకేజీ
న్యూఢిల్లీ ముచ్చట్లు:
దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలను సందర్శించుకోవాలనుకునే వారికోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తోంది. దీంతో ప్రయాణికులు సులభంగా ఆయా ఆలయాలను దర్శించుకోవచ్చు. త్వరలో నవరాత్రి 2022 ప్రారంభం కాబోతోంది. మీరు జమ్యూకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే IRCTC మీ కోసం సరైన ప్యాకేజీని అందిస్తోంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఒక స్మార్ట్, సరసమైన ప్యాకేజీతో ముందుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా వైష్ణో దేవి మందిరాన్ని సందర్శించేందుకు ఉపయోగపడుతుంది. ‘నవరాత్రి స్పెషల్ మాతా వైష్ణో దేవి యాత్ర టూర్’ పేరుతో, ఈ ప్యాకేజీలోనాలుగు రాత్రులు, ఐదు పగళ్లు ఉంటాయి. ఈ పర్యటన భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా అందించబడుతుంది.ఈ పర్యటన సెప్టెంబర్ 30, 2022న ప్రారంభం అవుతుంది. భారత్ గౌరవ్ రైలు ఢిల్లీ నుంచి బయలుదేరికత్రా రైల్వే స్టేషన్‌లో ముగుస్తుందని ఐఆర్‌సీసీటీసీ తెలిపింది. భారత్ గౌరవ్ రైలు పేర్కొన్న రైల్వేస్టేషన్‌లను కవర్ చేస్తుంది. ఢిల్లీ, ఘజియాబాద్, మీరట్, ముజఫర్‌నగర్, సహరాన్‌పూర్, అంబాలా, సిర్హింద్, లూథియానా స్టేషన్లు ఉంటాయి.
మొదటి రోజు ఈ రైలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ నుంచి రాత్రి 7 గంటలకు బయలుదేరుతుంది. పర్యాటకులు రాత్రి పూట రైలులో ఉంటారు. వారి కోసం విందు కూడా ఏర్పాటు చేసింది.

రెండో రోజు రైలు ఉదయం 10 గంటలకు కత్రా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఉదయం పర్యటకులకు అల్పాహారం అందించబడుతుంది. తర్వాత పర్యాటకులకు హోటల్‌లో భోజన సదుపాయం ఉంటుంది. తర్వాత మాతా వైష్ణో ట్రెక్‌ను ప్రారంభిస్తారు. యాత్రికులు కత్రాలో బస చేస్తారు.మూడో రోజు కత్రా వద్ద, మాతా వైష్ణోదేవి మందిరానికి తీసుకెళ్తారు. రాత్రి కత్రాలో బస ఉంటుంది.నాలుగో రోజు హోటల్‌లో అల్పాహారం, భోజనం ఉంటుంది. యాత్రికులు హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి కత్రా రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్తారు. ఢిల్లీకి వెళ్లే రైలు సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుంది. రాత్రిపూట ప్రయాణంలో భోజనం అందించబడుతుంది.
ఐదో రోజు ఉదయం టీ, అల్పాహారం రైలులోనే ఉంటుంది. తర్వాత రైలు ఢిల్లీ సప్ధర్‌జంగ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
వైష్ణో దేవీ ప్యాకేజీ ధరలు:
– సింగిల్ టికెట్ – రూ.13,790
– డబుల్/ట్రిబుల్ షేరింగ్ టికెట్ – రూ.11,990
– చైల్డ్ (5-11సంవత్సరాలు) -రూ.10,795
Tags: Navratri 2022 Package
