ముగిసిన శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి నవరాత్రి ఉత్సవాలు

Date:26/10/2020

తిరుచానూరు ముచ్చట్లు:

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప‌ది రోజుల పాటు జ‌రిగిన నవరాత్రి ఉత్సవాలు సోమ‌వారం ముగిశాయి. కోవిడ్‌-19 నిబంధ‌ల కార‌ణంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.చివ‌రి రోజు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనం‌తో విశేషంగా అభిషేకం చేశారు. అనంత‌రం రాత్రి 7 గంట‌లకు గజ వాహనసేవ ఏకాంతంగా జ‌రిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో  సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ కుమార్‌, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్  రాజేష్ క‌న్నా, వాహ‌నం ఇన్‌స్పెక్ట‌ర్ పురుషోత్తంరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

మీకు భూమి ఉందా….!!!! ?? మీకు గల భూమి పేర్లు రెవిన్యూ బాషలో ఎలా పిలుస్తారో తెలుసుకుందాం….

Tags: Navratri celebrations of Sri Padmavati Ammavari ended

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *