తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Daet:18/10/2020

తిరుచానూరు ముచ్చట్లు:

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు శ‌నివారం ప్రారంభ‌మ‌య్యాయి. ప‌ది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మ‌వారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ సంద‌ర్భంగా ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల‌కు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో విశేషంగా అభిషేకం చేశారు. అనంత‌రం రాత్రి ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఊంజల్‌సేవ నిర్వహించారు.  అక్టోబరు 26వ తేదీనాడు ఆల‌యంలో గజ వాహనసేవ చేప‌డ‌తారు. ఈ ఉత్స‌వాల కార‌ణంగా ఈ 10 రోజుల పాటు క‌ల్యాణోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌, అక్టోబరు 23న ల‌క్ష్మీపూజ సేవ‌లు రద్ద‌య్యాయి. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

ఇది చారిత్రాత్మకం..

Tags:Navratri festivities begin at Thiruchanur Sri Padmavati Ammavari Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *