Natyam ad

పుంగనూరులో అమ్మవార్లకు నవరాత్రి పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

నవరాత్రి ఉత్సవాలు వైభవంగా గురువారం నాల్గవ రోజు అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. పట్టణంలోని శ్రీబోగనంజుండేశ్వరస్వామి ఆలయంలో గల శ్రీపార్వతిదేవిని అన్నంతో అలంకరించారు. అలాగే శ్రీవిరూపాక్షి మారెమ్మను ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. శ్రీచాముండేశ్వరిదేవిని, శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవి, చదళ్ల గ్రామంలో గల శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అలంకారము చేశారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల సందర్భంగా ఆలయాలను విద్యుత్‌దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Post Midle

Tags: Navratri Pujas for Ammavars in Punganur

Post Midle