Natyam ad

అధికార లాంఛనాలతో నేవి కమాండో అంత్యక్రియలు

విజయనగరం ముచ్చట్లు:


హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన నేవి కమాండో చందక  గోవింద్ పార్ధివ దేహం అయన స్వగ్రామం చీపురుపల్లి మండలం పర్లకు చేరుకుంది. విశాఖ లోని ఐ.ఎన్.ఎస్ కర్ణ లో నేవి అధికారులు నివాళులర్పించి అనంతరం స్వగ్రామానికి తరలించారుర. గరివిడి మండలం పెనుబర్తి గ్రామం నుండి 20 కి.మీ మేర ర్యాలీగా గోవింద్ పార్ధీవదేహం తీసుకువచ్చారు. చిన్న వయసులోనే తమను వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ తల్లి చందక లక్ష్మి  కన్నీటి పర్యంతమయింది.  ప్రభుత్వ లాంఛనాలు ప్రకారం అంత్యక్రియలు చేపట్టారు.

 

Tags: Navy commando funeral with formalities

Post Midle
Post Midle