అగ్నిపథ్ పథకంపై నేవీ వివరణ

విశాఖపట్నం ముచ్చట్లు:


భారత సైన్యంలో చేరడా నికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం చేపట్టిందని తూర్పునౌకాదళం వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌ గుప్తా వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్‌ పథకంపై వివరించారు. సైన్యంలో యువతకు అత్యంత ప్రాధాన్యమిస్తుం దని, దీంట్లో సైన్యాన్ని అగ్నివీరులు అంటారని, వీరు 4 ఏళ్లపాటు పనిచేస్తారని తెలిపారు. ఆ తర్వాత వారి పనితీరును బట్టి 25శాతం మందిని రెగ్యులర్‌డి నియమిస్తారని పేర్కొన్నారు. వీరు 15ఏళ్లపాటు నాన్‌ ఆఫీసర్‌ కేడర్‌లో పనిచేస్తారన్నారు. తొలి సంవత్సరం అగ్నిపథ్‌ కింద సైన్యంలో చేరేవారికి మొదటి ఏడాది 30వేలు కాగా, దీంట్లో 9వేలు అగ్నివీర్‌ కార్పస్‌ఫండ్‌లో జతచేయగా, రెండో ఏడాది నెలకి 33వేలు, దీంట్లో 30శాతం అంటే 9900 కార్పస్‌ ఫండ్‌కి జమచే యగా, 3 ఏడాది నెలకి 36,500 లో 10950 కార్పస్‌ ఫండ్‌లోనూ, 4వ ఏడాది 40వేలు జీతంలో 12వేలు కార్పస్‌ ఫండ్‌కి జమ అవుతుందని తెలిపారు. ఇలా 4ఏళ్లలో 5.02లక్షలు కార్పస్‌ ఫండ్‌లో జమచేయగా మరో 5.02లక్షలు కేంద్రం జమచేస్తుందని పేర్కొన్నారు. నాలుగేళ్ల తర్వాత వడ్డీ కలుపుకుని 11.71లక్షలు చెల్లిస్తార న్నారు. ఇన్‌కంటాక్స్‌ మినహాయింపు కూడా ఈ నిధులకు ఉంటుందన్నారు. ప్రస్తుతం అబ్బాయిలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు.10వ తరగతి లేదా ఇంటర్‌ చదివిన యువతీ యువకులకు ఈ అవకాశం రానుందన్నారు. అర్హతలను బట్టి ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీలలో పనిచేయవచ్చని పేర్కొన్నారు. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21ఏళ్ల లోపు వారికే ఈ అవకాశం ఉంటుందన్నారు. అమ్మాయిలకు ప్రస్తుతం అవకాశం లేదని, తర్వాత కల్పిస్తామని చెప్పారు.

 

Tags:Navy explanation on the Agneepath scheme