బ్ర‌హ్మోస్ క్షిప‌ణిని ప‌రీక్షించిన నేవీ

Date:01/12/2020

న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:

బ్ర‌హ్మోస్ సూప‌ర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌కు చెందిన యాంటీ షిప్ వ‌ర్ష‌న్‌ను ఇవాళ భార‌త్ ప‌రీక్షించింది.  అండ‌మాన్ నికోబార్ దీవుల్లో ఈ క్షిప‌ణి ప‌రీక్ష జ‌రిగిన‌ట్లు అధికారులు చెప్పారు.
భార‌త్ ఇటీవ‌ల వ‌రుస‌గా బ్ర‌హ్మోస్ క్షిప‌ణిని ప‌రీక్షిస్తున్న విష‌యం తెలిసిందే. దానిలో భాగంగానే ఇవాళ  కూడా ఈ ట్ర‌య‌ల్ జ‌రిగింది.  గ‌త నెల 24వ తేదీన కూడా భార‌త్ .. బ్ర‌హ్మోస్
సూప‌ర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను ఇవాళ భార‌త్ విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది.  అండ‌మాన్ నికోబార్ దీవుల్లోనే ఆ ప‌రీక్ష కూడా జ‌రిగింది.  మ‌రో దీవిలో ఉన్న టార్గెట్‌ను ఆ మిస్సైల్
ధ్వంసం చేసింది.  ల్యాండ్ అటాక్ వ‌ర్ష‌న్‌కు చెందిన బ్ర‌హ్మోస్ క్షిప‌ణిని ఆ రోజున ప‌రీక్షించారు. భార‌తీయ ఆర్మీ నేతృత్వంలో ఆ ప‌రీక్ష జ‌రిగింది. ఇవాళ మాత్రం భార‌తీయ నేవీ ఆ మిస్సైల్‌ను
ప‌రీక్షించింది.

ఏయిడ్స్ పై అవగాహనా ర్యాలీ

Tags: Navy tests BrahMos missile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *