నయన్ పై కామెంట్స్ – పార్టీ నుంచి సస్పెండ్

Date:25/03/2019
చెన్నైముచ్చట్లు:
ముఖ నటుడు, డీఎంకే నేత రాధారవిపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. రాధారవి హీరోయిన్ నయనతారపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో..డీఎంకే క్రమశిక్షణా చర్యలు ఉల్లంఘన కింద రాధారవిని సస్పెండ్ చేసినట్లు డీఎంకే జనరల్ సెక్రటరీ కే అంబాజగన్ తెలిపారు. నయనతార నటించిన కొలైయుదిర్ కాలమ్ ట్రైలర్ లాంఛింగ్‌లో రాధారవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాధారవి మాట్లాడుతూ..నయనతార ఇపుడు పెద్ద స్టార్.. లేడీ సూపర్‌స్టార్. కొంతమంది ఆమెను పురచ్ఛి తలైవార్ ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి వారితో పోలుస్తున్నారు. అలాంటి వ్యక్తులతో నయనతారను పోల్చడం బాధాకరం. నయనతార మంచి నటి అని ఒప్పుకుంటా. కొన్నేళ్లు ఆమె ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఆమెపై పలు రకాల ఆరోపణలు కూడా వచ్చినా..ఆమె నిలదొక్కుకున్నారు. కానీ తమిళనాడు ప్రజలు ఏ విషయాన్నైనా నాలుగు రోజులు గుర్తుంచుకుని, మరిచిపోతారంటూ వ్యాఖ్యానించారు. నయనతార దెయ్యంలా నటిస్తోంది..సీతాదేవిలా నటించింది. దేవతల పాత్రల కోసం దర్శకులు గతంలో కేఆర్ విజయను ఎంచుకునేవాళ్లు. కానీ ప్రస్తుతం గౌరవప్రదంగా ఉన్న వాళ్లైనా సరే..ఎవరితో తిరిగేవాళ్లనైనా సరే ఆ పాత్రలో నటింపజేయొచ్చంటూ రాధారవి కామెంట్లు చేశారు.
Tags:Nayan comments on … party suspended

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *