Natyam ad

ఆచూకీ చెబితే రూ.2లక్షల నజరానా-పోలీసు కమిషనరేట్ వెల్లడి 

ఎన్టీఆర్ జిల్లా  ముచ్చట్లు:

విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏపీ సీఎం  వై.ఎస్.జగన్ మోహన్ సై జరిగిన దాడి కేసులో నిందితుల ఖచ్చిత  సమాచారాన్ని , దృశ్యాలను (సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించవచ్చని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ అధికారులు ప్రకటించారు.   ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా  నేరుగా తమను కలిసి  సమాచారం అందిస్తే రూ. 2 లక్షల  నగదును బహుమతిగా ఇచ్చి..  సమాచారాన్ని  అందించిన సాక్షుల వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామన్నారు.  సీఎం జగన్ పై దాడి ఖచ్చిత సమాచారం  తెలిస్తే కింద ప్రకటించిన పోలీసు అధికారులకు  ఫోన్ ద్వారా గాని,  వాట్స్ అప్  ద్వారా గాని, లేదా నేరుగా గాని  తెలియజేయవచ్చన్నారు. . ఎన్.టి.ఆర్.పోలీస్ కమిషనరేట్  డీసీపీ కంచి శ్రీనివాస రావు ఫోన్ నెంబర్- 9490619342, టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ ఆర్ శ్రీహరి బాబు ఫోన్ నెంబర్ 9440627089 కు సమాచారం ఇవ్వవచ్చు.             కార్యాలయ చిరునామా ,  కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ కార్యాలయం, నేతాజీ బ్రిడ్జి రోడ్, పశువుల ఆసుపత్రి పక్కన,  లబ్బీపేట, కృష్ణ లంక, విజయవాడ.

 

Post Midle

Tags: Nazarana-Police Commissionerate Reveals Rs.2 Lakhs for Locating

Post Midle