పుంగనూరు డిగ్రీకళాశాలలో ఎన్‌సీసీ ఆర్మీవింగ్
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు వెహోదటి సంవత్సరంలో ఎన్‌సీసీ ఆర్మీవింగ్ లో అడ్మీషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు దేశభక్తిని పెంపొందించేందుకు ఆర్మీవింగ్ ప్రారంభించామన్నారు. ఎన్‌సీసీఏ సర్టిఫికెట్లను అందిస్తామన్నారు. ఈ కోర్సులో చేరిన వారికి వెయిటేజ్ మార్కులు లభిస్తుందని ఆయన తెలిపారు. డిగ్రీ వెహోదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అడ్మీషన్లు లభిస్తుందన్నారు. విద్యార్థులు తమ పూర్తి ధృవపత్రాలతో డాక్టర్ టి..శ్రీనివాసులును సంప్రదించి నమోదు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఎన్‌సీసీ ఆధ్వర్యంలో వెహోక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

Tags; NCC Arming in Punganur Degree College
