పుంగనూరుకు పారిశ్రామికంగా అభివృద్ధి

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:24/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న పుంగనూరు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. గురువారం సమగ్ర పారిశ్రామికాభివృద్ధి సర్వే బృందం చిత్తూరు స్కిల్‌డెవలెప్‌మెంట్‌ ఆఫీసర్‌ మురళికృష్ణ, లీడ్‌ ఆఫీసర్‌ అశోక్‌కుమార్‌, కో ఆర్డినేటర్‌ రేవతి కలసి పుంగనూరులో సచివాలయ ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ మాట్లాడుతూ పుంగనూరు చింతపండు, టమోటా, పాడి ఆవులకు ప్రసిద్దిగాంచిందన్నారు. చింతపండు కుటీరపరిశ్రమగా ప్రతి ఇంటిలోను నిర్వహిస్తున్నారని , అలాగే టమోటా కూడ విస్తారంగా పండిస్తారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిలు కలసి పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సర్వే బృందాన్ని పంపారన్నారు. ఇందులో భాగంగా చింతపండు గుజ్జుతయారీ, చింతగింజలను పొడిచేసి విక్రయించడంతో పాటు టమోటా గుజ్జును తయారు చేసే పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వందలాది మందికి ఉపాధి ఉద్యోగాలతో పాటు పుంగనూరు అభివృద్ధి చెందుతుందని సూచించారు. పరిశ్రమలు నెలకోల్పేవారికి అన్ని విధాల చేయూతనందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు, మేనేజర్‌ రసూల్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

తిరుమలలో కర్ణాటక సత్రాల వసతి సముదాయాల నిర్మాణానికి భూమిపూజ‌

Tags: ndustrial development of Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *