150 మార్కులోచ్చిన వారికి నీట్ సీట్

Date:16/07/2018
ముంబై ముచ్చట్లు:
మెడిసిన్‌లో సీటు రావాలంటే విద్యార్థులు అహర్నిశలూ శ్రమించాలి కదూ. ఎంత కష్టపడినా ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రాకపోతే.. మళ్లీ తర్వాతి ఏడాది అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే. కానీ ‘నీట్’ వచ్చాక.. పరిస్థితి మారిపోయింది. డబ్బులు చేతిలో ఉంటే చాలు.. ఎంబీబీఎస్ సీటు మీ సొంతం అవుతుంది. నీట్ పరీక్షలో సబ్జెక్‌ల వారీగా కటాఫ్ మార్కులు లేవు. దీంతో నీట్-2017లో ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో సింగిల్ డిజిట్ మార్కులొచ్చిన 400 మంది ఎంబీబీఎస్ సీటు పొందారు. ఓ గాడ్ అనుకుంటున్నారా..? అప్పుడే అయిపోలేదు. ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో సున్నా లేదా నెగటివ్ మార్కులొచ్చిన 110 మంది కూడా మెడిసిన్‌లో చేరిపోయారు. వీరిలో ఎక్కువ మంది ప్రైవేట్ కాలేజీల్లో చేరినవారే. ఏంటి కళ్లు బైర్లు కమ్మాయా? ముందు వెలువరించిన నీట్ నోటిఫికేషన్ ప్రకారం ఒక్కో సబ్జెక్ట్‌లో కనీసం 50 శాతం మార్కులు రావాలనే నిబంధన విధించారు. కానీ తర్వాతి నోటిఫికేషన్‌లో పర్సంటైల్ సిస్టమ్‌ను తెరమీదకు తెచ్చి.. ఒక్కో సబ్జెక్టులో కనీసం 50 మార్కులు రావాలనే నిబంధనను తొలగించారు. దీంతో 720 మార్కులకుగానూ 150 కంటే తక్కువ మార్కులొచ్చిన 1990 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌లో సీట్లు పొందారు.
150 మార్కులోచ్చిన వారికి నీట్ సీట్ https://www.telugumuchatlu.com/neat-seat-for-those-who-have-150-marks/
Tags:Neat seat for those who have 150 marks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *