డిన్నర్ పార్టీలో నిహారిక

Date:30/11/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

మెగా ఫ్యామిలిలో పెళ్లి ముచ్చట్లు షురూ అయ్యాయి. నాగబాబు కూతురు మెగా డాటర్ నిహారిక పెళ్లి మరో పది రోజుల్లో అంటే డిసెంబర్ 9 న రాజస్థాన్ ఉదయపూర్ ఉదయ్ ప్యాలెస్ లో జరగబోతుంది. గుంటూరు రేంజ్ ఐజి కొడుకు చైతన్య ని వివాహం చేసుకోబోతున్న నిహారిక తన బ్యాచిలర్ పార్టీని తన ఫ్రెండ్స్ తో కలిసి గోవాలో జరుపుకుంది. అక్కడ బాగా ఎంజాయ్ చేసిన నిహారిక గత వారమే రాజస్టాన్ కి వెళ్ళిపోయింది. నిహారిక పెళ్లి ఏర్పాట్లని ఆమె అన్న వరుణ్ తేజ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అయితే ఈ పెళ్ళికి పవన్ కళ్యాణ్ రెండు రోజుల ముందే హాజరవుతాడనే టాక్ ఉంది. అలాగే మెగా ఫ్యామిలీ నాలుగు రోజుల ముందే రాజస్థాన్ కి వెళ్ళిపోతుంది అని ప్రచారం జరుగుతుంది.మరి పెళ్ళికి ముందే నిహారిక పార్టీలు, పబ్బులు అంటూ హడావిడి చేస్తుంది. పెళ్ళికి ముందే భర్త చైతన్య తో దీపావళి వేడుకలు చేసుకున్న నిహారిక తాజాగా తన పెళ్లి సందర్భంగా సిస్టర్స్ కి గ్రాండ్ డిన్నర్ పార్టీ ఇచ్చేసింది. మెగా స్టార్ చిరు కూతుళ్లు సుశ్మిత, శ్రీజ లతో పాటుగా ఇంకొంతమంది కజిన్స్ కి నిహారిక గ్రాండ్ గా సిస్టర్స్ పార్టీ ఇచ్చిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెల్లి పెళ్లి పార్టీలో అక్కల హడావిడి.. అంటూ ఆ ఫోటో కి క్యాప్షన్ పెట్టి మరీ వైరల్ చేస్తున్నారు మెగా ఫాన్స్. మరి నిహారికపెళ్లి కి ముందే రాజస్థాన్ లో ఇలాంటి పార్టీలు, మెహిందీ వేడుకలు, సంగీత్ ఫంక్షన్స్ అన్నిటికి మెగా ఫ్యామిలీ కచ్చితంగా హాజరవ్వాల్సిందే.

మార్చిలోగా వంశధార- నాగావళి అనుసంధానం

Tags: Nebula at the dinner party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *