చిత్తూరు ముచ్చట్లు:
జిల్లాలో పాల ఉత్పత్తి పెంపుకు చర్యలు చేపట్టడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు.శనివారం జిల్లా సచివాలయం లోని సమావేశపు మందిరం లో జిల్లా కలెక్టర్ జిల్లాలోని పాడిరైతులకు వివిధ డెయిరీ ల వారు ఇస్తున్న పాల ధర, పాల ఉత్పత్తి పెంచేందుకు తీసుకోవలసిన చర్యల పై జిల్లాలోని 21 ప్రైవేట్ డెయిరీ ల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూపాడి రైతులకు పాలకు ఒక్కో డెయిరీ వారు ఒక్కో ధరను ఇవ్వడం జరుగుతున్నదని, జిల్లాలో వ్యవసాయం తరువాత ఉద్యాన, పాడి పరిశ్రమ పై ఎక్కువ మంది రైతులు ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. వెన్న శాతం ఒకే విధంగా ఉన్నప్పటికీ ధర వ్యత్యాసానికి గల కారణాలపై చర్చించారు.పాల ఉత్పత్తిని పెంచేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరుగు తుo దని తెలిపారు.వివిధ డెయిరీలకు చెందిన ప్రతినిధులు మాట్లాడుతూ పాడి రైతులకు చెల్లించే పాల ధరలో వ్యత్యాసానికి గల కారణం డిమాండ్ సప్లై కారణమని, దానితో పాటు వివిధ డెయిరీల పోటీలను ఆధారం చేసుకుని ధరల మార్పు ఉంటుందని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో కో ఆపరేటివ్ డెయిరీకి పాలు పోసే పాడి రైతులకు లీటర్ కు రూ.5 ను అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతున్నదని, ఈ విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేస్తే బాగుంటుందని, దీనితో పాటు పశు భీమా పథకం ప్రస్తుతం సం.లో 4 నెలలు మాత్రమే అమలు చేయడం జరుగుతున్నదని, అలా కాకుండా సంవత్సరం అంతా అమలు చేయడం మరియు ప్రస్తుతం అందిస్తున్న రూ.30 వేలు భీమా మొత్తాన్ని పెంచాలని, తద్వారా పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని, డెయిరీల ప్రతినిధులు కలెక్టర్ కు వివరించారు.జిల్లాలో ఇప్పటి వరకు పశు గ్రాసం కొరకు జొన్న, మొక్క జొన్న విత్తనాలు సరఫరా చేయడం జరిగిందని పశు సంవర్థక శాఖ అధికారి డా. ప్రభాకర్ కలెక్టర్ కు వివరించారు.ఈ సమావేశంలో పశు సంవర్థక సహాయక డిడిలు గోవిందయ్య, ఆరిఫ్, 21 ప్రైవేట్ డెయిరీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Tags: Necessary measures will be taken to increase milk production in the district – District Collector