Natyam ad

అసని తుఫాను తో నష్టపోయిన  రైతాంగాన్ని ఆదుకోవాలి

ఖాజీపేట ముచ్చట్లు:


కడప జిల్లాలో కురిసిన అకాల వర్షాలు,అసని తుఫాన్ తో నష్టం పోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు  అధికారులు పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని  నష్టపోయిన పత్తి తోటలను పరిశీలించిన ఏపీ రైతు సంఘం కడప జిల్లా నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా                కడప జిల్లాలో  అసని తుఫాన్ ,అకాల వర్షాలతో,ఈదురు గాలులతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి.బి దస్తగిరి రెడ్డి తెలిపారు. గురువారం ఖాజీపేట మండలం అగ్రహారం, సుంకేసుల ,బీచువారిపల్లె తదితర గ్రామాలలో రైతు సంఘం నాయకులు పంటపొలాలను పరిశీలించారు అనంతరం  ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో అసని తుఫానుతో 3.258.8 ఎకరాలలో సాధారణ పంటలకు నష్టం వాటిల్లిందని ఇందులో 1184.5ఎకరాలలో పత్తి పంట నష్టం వాటిల్లిందని , 635 ఎకరాలలో వరి , 725 ఎకరాల్లో మినుము , వేరుశనగ, 31 ఎకరాలు ,185 ఎకరాలలో కోర్ర , 458 ఎకరాల్లో నువ్వులు , ఇదే కాక పొద్దుతిరుగుడు,సజ్జ పంటలకు కూడా నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.  జిల్లాలో బొప్పాయి మామిడి, అరటి, చీనీ , నిమ్మ కూరగాయల పంటలు, పూల తోటలకు కూడా భారీ స్థాయిలో నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. రైతు భరోసా అధికారులు వాలంట్రీలు క్షేత్రస్థాయిలో  పంటలను పరిశీలించి పంటనష్టాన్ని అంచనా వేసి నివేదికలను త్వరితగతిన జిల్లా ఉన్నతాధికారులకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ పర్యటన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బచ్చల వెంకటసుబ్బయ్య జిల్లా నాయకులు పెంచలయ్య చిన్న వెంకట్ రెడ్డి, వెంగల్ రెడ్డి నరసయ్య ,నాగయ్య , పరంధామయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Need to support farmers affected by Asani storm

Post Midle
Post Midle