గెలుపే ధ్యేయంగా పనిచేయాలి

Need to work on a winning goal

Need to work on a winning goal

-నాయకులకు మంత్రి అమరనాథ రెడ్డి దిశా,నిర్దేశ్యం

Date:16/09/2018

పలమనేరు ముచ్చట్లు:

2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా నాయకులు పనిచేయాలని పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథ రెడ్డి సూచించారు. పలమనేరు నియోజకవర్గం,గంగవరం మండలంలోని మామడుగు సమీపంలోని

 

గజారామం వద్ద ఆదివారం గండ్రాజుపల్లి,పసుపత్తూరు, గుండుగల్లు,కీలపల్లి,చౌడిరెడ్డి పల్లి పంచాయతీల నాయకులతో పార్టీ స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ

 

ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్ళి పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. గ్రామాలలోని సమస్యలను దాదాపుగా పరిష్కరించడమందని ఇంకా సమస్యలున్నట్లయితే గుర్తించి తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడడంతో పాటు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత నాయకులదేనన్నారు.

 

రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్దంగా పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసి సోమశేఖర్,మండల పార్టీ అధ్యక్షులు ప్రసాద్ నాయుడు, ప్రధాన కార్యదర్శి హరిబాబు, జిల్లా నాయకులు

 

వెంకట్రమణా రెడ్డి,బాలాజీ నాయుడు, మండల నాయకులు వెంకటేష్ నాయుడు,రహీంభాష, రెడ్డి శేఖర్, వెంకట్రమణ,మరియు పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్లు,కార్యదర్శులు ఉన్నారు.

30లోపు ఉపకార వేతనాలకు ధరఖాస్తు చేయండి

Tags: Need to work on a winning goal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *