నీట్ 2019 షెడ్యూల్  విడుదల

Lakhs six thousand people

Lakhs six thousand people

Date:12/06/2019

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

ట్-2019 ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) బుధవారం (జూన్ 12) విడుదల చేసింది. ఈ కౌన్సెలింగ్ ద్వారా 15 శాతం ఆలిండియా కోటా/ డీమ్డ్/సెంట్రల్ యూనివర్సిటీలు/ ఈఎస్‌ఐ & ఏఎఫ్‌ఎంఎస్ (ఎంబీబీఎస్/బీడీఎస్) సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంసీసీ ప్రకటించిన కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రకారం జూన్ 19 నుంచి మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 25న మధ్యాహ్నం 2 గంటల్లోగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మొదటి విడత కౌన్సెలింగ్
జూన్ 19న ప్రారంభమయ్యే దరఖాస్తు ప్రక్రియ 24 వరకు కొనసాగనుంది. అనంతరం జూన్ 25న ఛాయిస్ ఫిల్లింగ్‌‌, 26న సీట్ల కేటాయింపు చేపడతారు. జూన్ 27న మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటించనున్నారు. ఆగస్టు 20 నుంచి 26 మధ్యలో సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందినవారు జూన్ 28 నుంచి జులై 3లోగా సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
రెండో విడత కౌన్సెలింగ్

 

 

ఇక రెండో విడత ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థుల నుంచి జులై 6 – 9 మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు. జులై 9న మధ్యాహ్నం 12 గంటల్లోగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. అభ్యర్థులు అదేరోజు ఛాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం జులై 10, 11 తేదీల్లో సీట్లు కేటాయించి.. జులై 12న సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటించనున్నారు. సీట్లు పొందినవారు జులై 13 – 22 మధ్యలో సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
చివరి విడత కౌన్సెలింగ్
అదే విధంగా.. చివరి విడతగా (మాపప్ రౌండ్) సెంట్రల్/ డీమ్డ్/ ఈఎస్‌ఐసీలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 16 వరకు ఫీజు చెల్లించాలి. అనంతరం అదేరోజు సాయంత్రం 5 గంటల్లోగా చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 17న సీట్లను కేటాయిస్తారు. 18న సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటిస్తారు. ఆగస్టు 20 నుంచి 26 మధ్యలో సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

గిరిపుత్రులకు ప్రత్యేకం

Tags:Neet 2019 Schedule Released

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *