స్వతంత్ర సమరయోధుల పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం
– బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య
న్యూఢిల్లీ ముచ్చట్లు:

స్వాతంత్య్రం వచ్చి డెబ్బై అయిదు 75 సంవత్సరాలు గడిచినా కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం , మరియు ప్రభుత్వ అధికారులు ఒక స్వతంత్ర సమరయోధుడి పట్ల నిర్లక్ష్యం వహించడం సమంజసం కాదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు.జంతర్ మంతర్ ధర్నాచౌక్ వద్ద బీసీల సంక్షేమం కోసం జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతూ అనాదికాలం నుండి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తూ ఇంకా ఎంతకాలం ఈ అణచివేతకు గురిచేస్తారని ప్రశ్నించారు. ఒక బీసీ కులానికి చెందిన స్వాతంత్య్ర సమర యోధుడు కీర్తి శేషులు కోవూరి మొగులయ్యగౌడ్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసి కబ్జా ఇప్పించకపోవడం చాలా బాధాకరమని ఆవేదనను వ్యక్తం చేశారు. మరియు స్వాతంత్య్రం వచ్చి డెబ్బై అయిదు 75 సంవత్సరాలు గడిచినా కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం , ప్రభుత్వ అధికారులు ఒక స్వతంత్ర సమరయోధుడి పట్ల నిర్లక్ష్యం వహించదాన్ని తప్పుబట్టారు. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు ప్రత్యేకమైన చొరవ తీసుకొని సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు కీర్తి శేషులు కోవూరి మొగులయ్యగౌడ్ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేసారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమా? రాక్షస రాజ్యమా?
తదనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమా? రాక్షస రాజ్యమా? అంటూ స్వాతంత్య్ర ఉద్యమంలో స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులయ్యగౌడ్ తన జీవితాన్ని త్యాగం చేసి పదకొండు నెలలు జైలు పాలై తెలంగాణ రాష్ట్రంలో తను కోరుకున్న స్వరాజ్యం రావాలని ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తే అట్టి స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబానికి 75డెబ్బై అయిదు సంవత్సరాలు గడిచినా కూడా తనకు కేటాయించిన పదెకరాల భూమి కబ్జా ఇప్పించకపోవడం చాలా బాధాకరమని తెలియజేశారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు యావత్ భారత దేశ ప్రజలకు అర్థమయ్యే రీతిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అలుపెరగని ఉద్యమాలు పోరాటాలు జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మొండి వైఖరి మానుకొని స్వతంత్ర సమరయోధుడు కుటుంబానికి న్యాయం చేకూర్చాలని తెలియజేశారు లేని యెడల ఉద్యమాలు ఉద్రిక్తంగా కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు లాల్ కృష్ణ, ఉదయ్ కుమార్ నేత, రామకృష్ణ, పృథ్వి గౌడ్ , సురేందర్, పులి సంగప్ప గౌడ్ ,జయంతి , మంజుల మరియు ప్రముఖ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
.
Tags: Neglect of Telangana government towards freedom fighters
