నిధులపై నిర్లక్ష్యం (సంగారెడ్డి)

Neglect on funding (sagareddy)

Neglect on funding (sagareddy)

Date:06/10/2018
సంగారెడ్డి ముచ్చట్లు:
ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్న విద్యాశాఖ నిధులు కేటాయించడంలో మాత్రం నిర్ణక్ష్యం వహిస్తోంది. వెయ్యికిపైగా విద్యార్థులున్న పాఠశాలలకు.. వంద మంది విద్యార్థులున్న పాఠశాలలకు ఒకే రకమైన నిధులు కేటాయిచడంతో కొందరు ప్రధానోపాధ్యాయులు తమ చేతి నుంచి ఖర్చు చేయాల్సి వస్తుంది. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు అవుతున్నా.. స్కావెంజర్స్‌ నిధులు మినహా.. మిగిలినవి ఇంకా విడుదల చేయలేదు.
దీంతో ప్రధానోపాధ్యాయుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ ఏడాది నుంచి సర్వ శిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ కలిపి సమగ్ర శిక్షా అభియాన్‌గా మార్చారు. వీటి నిధుల జాడ ఇంత వరకు లేదు. ప్రతి నెలా బిల్లులు తమకు తలకు మించిన భాగంగా మారుతున్నాయని ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్‌ఎస్‌ఏ నుంచి ప్రతి ఏడాది ప్రభుత్వం పాఠశాలలకు నిధులు కేటాయిస్తుంది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. 1-5 తరగతుల వరకు బోధించే ప్రాథమిక పాఠశాలలకు పాఠశాల నిర్వహణ గ్రాంటు కలిపి రూ.10 వేలు, 1 నుంచి 8వ తరగతి వరకు బోధించే ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.17 వేలు,
6 నుంచి పదో తరగతి వరకు బోధించే ఉన్నత పాఠశాలకు రూ.10 వేలు గ్రాంటు ఎస్‌ఎస్‌ఏ చెల్లిస్తుంది. ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా ఉన్నత పాఠశాలలకు రూ.50 వేలు అదనంగా వచ్చేవి. ఈ ఏడాది ఆర్‌ఎంఎస్‌ఏను ఎస్‌ఎస్‌ఏలో విలీనం చేయడంతో ఈ నిధులకు సంబంధించి ఇప్పటి వరకు స్పష్టత లేదు. నిధులు వస్తాయా లేదా అనే విషయమై ప్రధానోపాధ్యాయుల కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిధులు రాకుంటే పాఠశాలల్లో ఖర్చు ఎలా చేయాలని మదన పడుతున్నారు.
1149 పాఠశాలలకు విద్యుత్తు కనెక్షన్‌ ఉంది. వీటికి విద్యుత్తు మీటర్‌ వ్యాపార కనెక్షన్‌ కింద ఇస్తారు. జిల్లాలో 203 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతుల బోధన, గదుల్లో ఫ్యాన్లు, కంప్యూటర్‌ తరగతులు చాలా పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. వీటి వినియోగం వల్ల విద్యుత్తు బిల్లు పెరుగుతోంది. సంగారెడ్డిలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 1100 మంది విద్యార్థినులు చదువుతున్నారు.
ఇక్కడ నెలకు రూ.5 వేలు విద్యుత్తు బిల్లు వస్తుంది. తమ సొంత డబ్బులతో బిల్లులు చెల్లిస్తున్నానని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజితలీల తెలిపారు. విద్యుత్తు బిల్లు, ఇతర ఖర్చుల కోసం వచ్చే రూ.25 వేలు ఏ మాత్రం సరిపోవడం లేదని ఆమె పేర్కొన్నారు. వీటితో పాటు ప్రభుత్వం కోరే వివరాలు సమర్పించేందుకు అంతర్జాలంపై ఆధార పడుతున్నారు. హరితహారం కార్యక్రమం, స్వచ్ఛభారత్, మరుగుదొడ్ల నిర్వహణ, చేతులు కడుక్కునేందుకు, నీటి సరఫరా, మొక్కలకు నీరు పోయడం వంటివి తప్పని సరిగా మారాయి. ఈ పనులన్నింటికీ విద్యుత్తు వినియోగం తప్పనిసరి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు. ప్రణాళిక ప్రకారం నిధులు మంజూరు చేసినా ఇబ్బందులు ఉండవని పేర్కొంటున్నారు.
ఉన్నత పాఠశాలలు ఆర్‌ఎంఎస్‌ఏ నిధులతోనే నెట్టుకొస్తున్నాయి. ఈ ఏడాది ఎస్‌ఎస్‌ఏలో విలీనం చేశారు. దీని కింద వచ్చే రూ.50 వేలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం రాలేదని ఎస్‌ఎస్‌ఏ అధికారులు పేర్కొంటున్నారు.
గతేడాది వరకు రూ.25 వేలతో సైన్స్‌ పరికరాలు, మరో రూ.25 వేలతో విద్యుత్తు బిల్లులు, ఇతర ఖర్చులకు కేటాయించే వారు. విద్యా సంవత్సరం ప్రారంభించి నాలుగు నెలలైనా ఆర్‌ఎంఎస్‌ఏ నిధులకు సంబంధించి క్లారిటీ రాకపోవడంతో వస్తాయా రావా అనే సంశయంలో ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
Tags:Neglect on funding (sagareddy)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed