పట్టించుకోని అధికారులు= పోతున్న ప్రాణాలు

Date:21/10/2019

కాకినాడ ముచ్చట్లు:

అధికారుల అలసత్వం, కొరవడిన నిఘా.. కానరాని రక్షణ చర్యలు వెరసి బాణసంచా తయారీ కేంద్రాల్లో అగ్నిప్రమాదాలు ఏయేటికాయేడు పెరుగుతున్నాయి. ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అనేకమంది ఆసుపత్రుల పాలవుతున్నారు. దసరా, దీపావళి పండుగల సీజన్లలో బాణసంచా తయారీ కేంద్రాల్లో అగ్నిప్రమాదాలు సంభవించి పదులసంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. అదేస్థాయిలో క్షతగాత్రులవుతున్నారు. సెప్టెంబర్‌ 30న సామర్లకోట మండలం జి.మేడపాడులోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. తాజాగా ఈనెల 18న తాళ్లరేవు మండలం జి.వేమవరంలో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. కనీస తనిఖీలు లేకపోవడమే ప్రమాదాలకు కారణమని స్పష్టమవుతోంది. బాణసంచా తయారీ కేంద్రాల్లో దసరా, దీపావళి పండుగల సమయాల్లో ఏటా భారీ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. తరచూ తనిఖీలు చేసి ప్రమాదాలు నివారించాల్సిన రెవెన్యూ, పోలీసులు, అగ్నిమాపక శాఖల అధికారులు ఆ పని చేయడంలేదు. దీంతో ఏటా అగ్ని ప్రమాదాలు జరిగి అనేకమంది మృత్యువాత పడుతున్నారు. దీపావళి పండుగ మరో వారం రోజుల్లో రానుంది.

 

 

 

 

ఈ నేపథ్యంలో జిల్లాలో ముమ్మరంగా బాణసంచా తయారీ జరుగుతోంది. గతనెల 30న సామర్లకోట మండలం జి.మేడపాడులోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురు మృతి చెందారు. పనుల్లేక బాణసంచా తయారీకి వెళ్లిన కూలీలు మృత్యువాత పడటంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. బాణసంచాతయారీకి అనుమతులున్నప్పటికీ భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ఘోరం జరిగింది.తాళ్లరేవు మండలం జి.వేమవరంలోని బాణసంచా కేంద్రంలో ఈనెల 18న జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక, విపత్తుల నిర్వహణశాఖ నుంచి ఈ కేంద్రానికి అనుమతి రెన్యువల్‌ కాలేదు. ఈ ఏడాది జనవరి 19వ తేదీతో గడువు ముగిసింది. రెవెన్యూ, పోలీసు అగ్నిమాపక శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడంతో ఇటీవల ఘోరం జరిగింది. దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న తరుణంలో అధికారులు తనిఖీలు చేయాల్సి ఉన్నప్పటికీ వారు ఆ పని చేయడంలేదు.1996లో జువ్విపాడులో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 2003లో చినదావరకోడిలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

 

 

 

 

2006లో రాజమహేంద్రవరంలోని మోరంపూడి సెంటర్‌ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 2007లో దేవీచౌక్‌ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 2008లో వేట్లపాలెంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు, 2009లో కాకినాడలో నలుగురు మృతి చెందారు. 2010లో బొమ్మూరులో ఓ బాలుడు మృతిచెందాడు. 2011లో రాజమహేంద్రవరంలో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. 2014లో కొత్తపల్లి మండలం వాకతిప్పలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 18 మంది మృత్యువాతపడ్డారు. 2015లో కొత్తపేటలో నలుగురు మృతి చెందారు. రాజమహేంద్రరంలో లాలాచెరువు ప్రాంతంలోని సుబ్బారావుపేటలో అనుమతి లేని బాణసంచా తయారీ కేంద్రంలో 2018 సెప్టెంబర్‌ 22వ తేదీ అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే ఏడాది 28వ తేదీన కె.గంగవరం మండలం గంగవరంలో మణికంఠ ఫైర్‌వర్క్స్‌లో క్రాకర్స్‌ తయారుచేస్తుండగా జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు మృతి చెందారు. ఏటా అనుమతి ఉన్న, అనుమతి లేని బాణాసంచా తయారీ కేంద్రాల్లో అగ్నిప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాపక శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు బాణసంచా తయారీ కేంద్రాలను తనిఖీచేసి భద్రతా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

విశాఖలో బలమైన నేతల కోసం ఎదురుచూపులు

Tags: Neglected Officers = Passing Lives

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *