చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి బయటపడ్డ డాక్టర్ల నిర్లక్ష్యం
– ఆపరేషన్ చేసే ప్లేట్లు లేవని మధ్య లోనే ఆపరేషన్ నిలిపేసిన వైనం
చిత్తూరు ముచ్చట్లు:
ఎముకల సర్జీరీలలో వాడే ప్లేట్లను కూడా సమకూర్చుకోకుండా ఆపరేషన్ ప్రారంభించి , ఆ ప్లేట్లు లేవని డాక్టర్ ఆపరేషన్ నిలిపివేసారు. వివరాలు ఇలా వున్నాయి. యాదమరి మండలం దళవాయిపల్లికి చెందిన పుష్పమ్మ అనే వృద్దురాలికి ప్రమాదవశాత్తు కాలు విరిగింది. చిత్తూరు హాస్పిటల్ లో ఆపరేషన్ చేసుకుందామని వచ్చిన పుష్పమ్మను(62) ను ఎక్సరేలు, స్కానింగ్ లు ఇతరత్రా టెస్టులన్ని బయట ప్రైవేటుగా చేసుకోవాలని ముప్పతిప్పలు పెట్టారు. అన్ని టెస్ట్ లు స్వంత ఖర్చులతో ప్రైవేటుగా చేయించాక ఆపరేషన్ ప్రారంభించారు. ఆపరేషన్ ప్రారంభించిన అనంతరం ఎముకకు అమర్చాల్సిన ప్లేటు ప్రభుత్వ హాస్పిటల్ లో లేదని తెలియడంతో ఆపరేషన్ ను అర్దాంతరంగా ఆపేసారు. విఫయం పుష్పమ్మ కుమారుడికి చెప్పారు. తరువాత వెంటనే పుష్పమ్మ ఆరోగ్యం నిలకడగా లేదని , ఆమె శరీరం సర్జరీకి సహకరించడం లేదని సామాచారం ఇచ్చారు. చేసేదేది లేక పుష్పమ్మను ప్రైవేటు హాస్పిటల్ కు తరలించాడు. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని బాధితులు కోరుతున్నారు.

Tags; Negligence of doctors exposed once again in Chittoor government hospital
