బోర్ మరమ్మత్తులు చేయడంలో మున్సిపాలిటి అధికారులు నిర్లక్ష్యం.

-తాగునీటి ఇబ్బందుల్లో ప్రజలు.

 

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి మున్సిపాలిటీ రెండవ వార్డు మంజునాథ కాలనీలో తాగునీటి సరఫరా బోరు మరమ్మత్తులకు గురైంది. దింతో మోటర్ రిపేరు కోసం బోరు బావి నుండి మోటార్ ను తీసివేసి తీసుకెళ్లారు. మే నెల 20 తేదీన రిపేర్ చేయడానికి మున్సిపాలిటీ సిబ్బంది మోటార్ ని తీసుకెళ్లి ఇప్పటి వరకు తిరిగి ఏర్పాటు చేయక పోవడం తో స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన స్థానిక కౌన్సిలర్ మరియు నీటి సరఫరా విభాగం మున్సిపాలిటీ సిబ్బంది వెంటనే మోటార్ ను ఏర్పాటు చేసి నీటి సరఫరా ను పునరుద్దరించాలని కోరితున్నారు. కాగా ప్రత్యామ్నాయంగా ట్యాంకులతో నీటి ని అందిస్తున్న, రోజు వారి కూలీ పనులకు వెళ్ళే వారికి ఇబ్బంది గా మారిందని వాపోతున్నారు. దీనిపై ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి సమస్య ను పరిష్కారం చేయాలని మంజునాథ కాలనీ ప్రజలు కోరుతున్నారు.

 

Tags: Negligence of the municipal authorities in bore repairs.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *