Natyam ad

నెల్లిమంద పాలేటమ్మ జాతర వేడుకలు ప్రారంభం

సోమల ముచ్చట్లు:


చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నెల్లిమంద పాలేటమ్మ జాతర ఆదివారం ప్రారంభమైనది. సోమల మండలం నెల్లిమంద వద్ద వెలసిన పాలేటమ్మ గ్రామ దేవత ఉత్సవాలు ప్రతి ఏడాది ఆగస్టు మొదటి వారంలో అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆది, సోమవారాల్లో వైభవంగా జాతర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద సిద్ధ పూజ నిర్వహించి జాతర ప్రారంభించారు. అమ్మవారికి అభిషేక పూజల అనంతరం ప్రత్యేక అలంకరణలు చేసి గ్రామస్తులకు దర్శన కల్పించారు. రాత్రికి గ్రామాల వారీగా మహిళలు బోనాల సమర్పించిన అనంతరం చాందిని బళ్లు ఊరేగింపు నిర్వహిస్తారు. సోమవారం వేకువజాము నుంచి రాత్రి వరకు గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తారు. రాత్రి దోపు ఉత్సవంతో జాతర ముగిస్తారు. ఆలయం వద్ద ధర్మకర్త నరసింహులు మరియు జాతర కమిటీ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు .ముందస్తు చర్యల్లో భాగంగా డీఎస్పీ గంగయ్య చౌడేపల్లి సీఐ మధుసూదన్ రెడ్డిల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

Tags: Nellimanda Paletamma fair celebrations begin

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.