Natyam ad

శరవేగంగా మారుతున్న నెల్లూరు రాజకీయలు

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా రాజకీయలు  శర వేగంగా మారుతున్నాయి.  నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఎండి ఖలీల్ అహ్మద్ పేరు ప్రకటించడంపై ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కినుకువహించారు. తన ప్రమేయం లేకుండా ఖలిల్ అహ్మద్ పేరు ప్రకటనపై వేమిరెడ్డి ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.  నెలరోజుల క్రితమే ఉదయగిరి,కావలి, నెల్లూరు సిటీ అభ్యర్థులను మార్చుకుంటే ఎంపీగా పోటీ చేయనని వేమిరెడ్డి భీష్మించు కూర్చున్నట్లు నెల్లూరు పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట  ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో అంతా సద్దుమణిగిందనుకున్నారు. ఆరవ జాబితాలో నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ పేరు  ప్రకటన కావడంపై వేమిరెడ్డి మౌనం ముద్ర వహించారు. వేమిరెడ్డి పార్టీ మారుతారు అన్నట్లు కూడా ప్రచారాలు ఊపొందుకున్నాయి.  కానీ అలాంటిదేంలేదని వేమిరెడ్డి వర్గం ఈ ఊహాగానాలను కొట్టి పారేస్తుంది.

 

Tags: Nellore politics is changing fast

Post Midle
Post Midle