Natyam ad

రూరల్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నా–నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిశ్రీధర్ రెడ్డి

నెల్లూరు ముచ్చట్లు:


నెల్లూరు రూరల్ లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకురావడంలో తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. రూరల్ పరిధిలోని 26వ డివిజన్ విక్రమ్ నగర్ పార్క్ వద్ద శుక్రవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలని మిగిలిన సమయంలో అభివృద్ధి పై ప్రత్యేక దృష్టిసారించడమే తన లక్ష్యమన్నారు. నెల్లూరు రూరల్ లో స్థానికంగా  ఏ సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా చెప్పారు. స్థానిక సంస్థల పరిష్కారం కోసమే గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బూడిద సుప్రజ, స్థానిక డివిజన్ వైకాపా ఇంచార్జ్ బూడిద పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy is working tirelessly for rural development

Post Midle
Post Midle