నేపాల్ గ్యాంగ్ అరెస్ట్

Date:12/10/2020

హైదరాబాద్ ముచ్చట్లు

వారం రోజుల క్రితం రాయదుర్గం పీయస్ లిమిట్స్ బీ.ఎన్. రెడ్డి నగర్ లో జరిగిన భారీ చోరీ నీ చేధించామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. నేపాల్ కు చెందిన నేత్ర బహదూర్ శాహీ, ప్రకాష్ శాహీ, సీత లను అరెస్ట్ చేసారు.  మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 5 లక్షల రూపాయల నగదు తో పాటు 300 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాదీనం చేసుకున్నామని అయన అన్నారు. గూడూరు మదుసూధన్ రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. మత్తుమందు ఇచ్చి చోరీ చేశారు. వంటమనిసిగా పనిచేస్తున్న జానకి కుక్ ఇంట్లో వారికి మత్తుమందు ఇచ్చింది.  మధుసూదన్ రెడ్డి భార్య శైలజా రెడ్డి మత్తుమందు ఇచ్చిన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం తో ఆమెను కొట్టి కట్టేశారు. ప్రధాన నిందితుడు నేత్ర బహదూర్ శాహీ గతంలో రాజేంద్ర నగర్, బెంగళూరు లలో కూడా ఈ తరహా చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడని అయన అన్నారు. పది టీమ్ లు ఏర్పాటు చేసి నిందుతులను పట్టుకోవడం జరిగిందని సి. పి. సజ్జనార్ అన్నారు.

రాజకీయాలలో విలువలు పెంపొందించిన వ్యక్తి భగవాన్ దాస్

Tags:Nepal gang arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *