నేపాల్ విమాన ప్రమాదం..సోషల్ మీడియాలో వీడియోలు
ఖట్మాండు ముచ్చట్లు:
నేపాల్ లో ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు ఎయిర్ హోస్టెస్ చేసిన వీడియో, ప్రమాదం జరిగిన సమయంలో మరో వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.కుప్పకూలిన విమానం సిబ్బందిలో ఒక ఎయిర్ హోస్టెస్ కూడా ఉంది. ఆ ఎయిర్ హోస్టెస్ కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విమాన ప్రమాదానికి ముందు ఆమె టిక్ టాక్ వీడియో తీసుకుంది. ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.కాగా, ఇదే తన చివరి ప్రయాణం అని తెలియని ఎయిర్ హోస్టెస్ ఒసిన్.. విమానంలోకి ప్రయాణికులు ఎవరూ రాక ముందు సెల్ఫీ వీడియో తీసుకుంది. అందులో నవ్వుతూ ఎంతో ఆనందంగా కనిపించింది. కానీ, ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 68 ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది మృతి చెందారు.మరోవైపు లైవ్ వీడియో కూడా వైరల్ కావడంతో ఇప్పుడు ఈ వీడియోలు నెటిజన్ల హృదయాలను కలచివేస్తున్నాయి.
Tags: Nepal plane crash..videos on social media

