చంద్రబాబు విలాసాంపై  నెట్ జన్లు సెటైర్లు

Net Jones Seaters on Chandrababu Vilasam

Net Jones Seaters on Chandrababu Vilasam

Date:10/08/2018
అమరావతి ముచ్చట్లు:
కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి అయిన ఖర్చుపై సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని సేకరించి ‘బెంగళూరు మిర్రర్’ ప్రచురించిన కథనం సంచలనంగా మారింది. కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ పార్టీ నేతలు హాజరైన సంగతి తెలిసిందే. వీరి అతిథి మర్యాదల కోసం కర్ణాటక ప్రభుత్వం భారీ మొత్తాన్ని వెచ్చించడం కన్నడ నెటిజన్లలో చర్చకు దారి తీస్తోంది. ప్రభుత్వ సొమ్ముతో నేతల విలాసాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి ఈ ఉదంతంతో. వీళ్లందరూ బెంగళూరులో గడిపింది కొన్ని గంటలే అయినా.. వీరి అతిథి మర్యాదల బిల్లులు మాత్రం తడిసిమోపెడయ్యాయి. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు హాజరైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బెంగళూరులో వీరి బస, ఇతర ఏర్పాట్ల కోసం కర్ణాటక ప్రభుత్వ ఖజానా నుంచి భారీ మొత్తాన్ని ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. ఒక్కో నేత కోసం కనిష్టంగా లక్ష రూపాయల మొత్తం నుంచి గరిష్టంగా 8.7 లక్షల రూపాయల మొత్తం వరకూ వెచ్చించింది కర్ణాటక ప్రభుత్వం. కొన్ని గంటలసేపటి కోసమే వీళ్ల అతిథి మర్యాదల ఖర్చు ఈ స్థాయిలో ఉండటంతో నెటిజన్లు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతగా వీరికి అతిథి మర్యాదలు చేయాలనుకుంటే జేడీఎస్ పార్టీ తమ సొంత ఖర్చుతో ఏర్పాట్లు చేసుకోవాల్సింది అని, ప్రభుత్వ సొమ్ముతో అంటే ప్రజల సొమ్ముతో ఇలా విలాసాలకు పోవడం ఏమిటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కన్నడ నెటిజన్లు బాగా ఆశ్చర్యపోతున్నది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఖర్చు గురించినే. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి అని బెంగళూరు వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ దాదాపు 18 గంటల సేపు ఉన్నారు. ఈ గంటల వ్యవధిలోనే బాబు అతిథి మర్యాదలకు కర్ణాటక ప్రభుత్వం వెచ్చించిన మొత్తం అక్షరాలా 8.7 లక్షల రూపాయలు. మిగిలిన నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఖర్చు ఒక్కొక్కరి మీదా లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకూ ఉండగా.. చంద్రబాబు ఖర్చు మాత్రం ఏకంగా 8.7 లక్షల రూపాయలుగా నమోదవ్వడం పట్ల అందరూ నిశ్చేష్టులు అవుతున్నారు. మరీ ఇంత విలాసమా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Tags: Net Jones Seaters on Chandrababu Vilasam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *