మహాభారతం మారిందంటూ నెట్ జన్స్ కామెంట్స్

న్యూఢిల్లీ ముచ్చట్లు:

భారతదేశ 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రామ్‌నాథ్ కోవింద్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నెటిజన్లు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. ‘రాముడు వెళ్లిపోతున్నాడు.. ద్రౌపది వస్తోంది.. రామాయణానికి ముగింపు.. మహాభారతం మొదలైంది’ అంటూ రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము పేర్లకు ఉన్న ప్రాధాన్యాన్ని ఉద్దేశించి తమదైన శైలిలో స్పందిస్తున్నారు.కాగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్.. నూతన రాష్ట్రపతి రాక గురించి తనదైన శైలిలో స్పందించారు. ‘మహాభారతం మారింది.. ద్రౌపది ఇప్పుడు రాష్ట్రపతి అయ్యారు.. పార్థ జైల్లో ఉన్నాడు’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. మహాభారతంలో ద్రౌపది పాత్ర ఏంటో అందరికీ తెలిసిందే. పాండవుల భార్యగా ఉన్న ఆమె.. ఎన్నో కష్టాలను అనుభవించింది. ఓ మహిళ స్థానం ఇంటికే పరిమితం కాదు.. దేశ అత్యున్నత పదవిని సైతం ఆమె అధిరోహించగలదు అనే అర్థం వచ్చేలా తస్లీమా నస్రీన్ ట్వీట్ చేశారుమరి పార్థా జైల్లో ఉన్నాడని తస్లీమా చేసిన వ్యాఖ్యలు ఎవరివనే చర్చ మొదలైంది. మహాభారతంలో పార్థుడు అంటే శ్రీకృష్ణుడు. ఆయన కారాగారంలోనే జన్మించిన సంగతి తెలిసిందే.

 

కానీ ఆ పార్థుడికి, తస్లీమా ప్రస్తావించిన పార్థుడికి బోలెడంత తేడా ఉంది.బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో టీఎంసీకి చెందిన మంత్రి పార్థా ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా.. ఆయనకు మూడు ఫ్లాట్లు ఉన్నాయని తేల్చిన ఈడీ అధికారులు.. కేవలం శునకాల కోసమే ఓ లగ్జరీ ఫ్లాట్ ఉన్నట్లు గుర్తించారు. శనివారం ఈడీ అధికారులు పార్థా ఛటర్జీని అరెస్ట్ చేయగా.. కోల్‌కతాలోని ఆయన సహయకురాలు, నటి అర్పితా ముఖర్జీ నివాసంలో జరిపిన సోదాల్లో రూ.21 కోట్ల నగదు, కోటి రూపాయలకుపైగా విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మంత్రి అరెస్ట్ వ్యవహారం.. ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించిన తస్లీమా నస్రీన్.. పార్థా జైల్లో ఉన్నాడంటూ ట్వీట్ చేశారు.

 

Tags: Net people comments that Mahabharata has changed

Leave A Reply

Your email address will not be published.