చంద్రబాబు రాజకీయాలపై నెట్ జన్ల సెటైర్లు

Date:20/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

చంద్రబాబు విషయంలో ఒకటి ప్రచారంలో ఉంది. ఆయన ఆశ, శ్వాస అన్నీ రాజకీయాలేనని అంటారు. ఆయన బంధాలకు పెద్దగా విలువ ఇవ్వరని కూడా చెబుతారు. సొంత పార్టీలో కూడా ఆయన రాజకీయంగా మంచి చెడ్డలు లెక్కలు బేరీజు వేసుకునే ఎవరికైనా పదవులు ఇస్తారని చెబుతారు. చంద్రబాబు ఇపుడు ముదిమి వయసులో ఉన్నారు. ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఆయన అనుసరిస్తున్న పోకడను ఇపుడు ఒక్కసారిగా మార్చుకుంటారని ఎవరూ అనుకోరు. అలాంటిది చంద్రబాబు ఇపుడు దివంగత నేత వైఎస్సార్ ని గుర్తుచేసుకున్నారు. అంతే కాదు, ఆయన తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ పదిమందిలోనూ గట్టిగానే చెప్పుకున్నారు. అయితే ఆయన మాటలు ఆసక్తికలిగించినా పెద్దగా ఎవరూ పట్టించుకోవడంలేదు.

 

 

 

 

అంతెందుకు కన్న కొడుకు జగన్ సైతం తన తండ్రి బెస్ట్ ఫ్రెండ్ బాబు అంటే నవ్వేస్తున్నారు. మరి బాబుకు స్నేహితులు లేరా, వారిలో వైఎస్సార్ ముందు వరసలోకి రారా అంటే అది బాబునే అడగాలి మరి.వైఎస్సార్ విషయంలో నమ్మితే చాలు అతన్ని
జీవితాంతం గుర్తుపెట్టుకుంటారన్ని చెప్పేవారు ఎంతో మంది ఉంటారు. తనకు వైఎస్ వల్లనే రాజకీయ జీవితం లభించిందని చెప్పేవారూ ఉన్నారు. ఇక వైఎస్ తో రాజకీయాలకు అతీతంగా పాత స్నేహాన్ని కొనసాగించిన వారూ ఉన్నారు. వైఎస్ వైపు నుంచి చూస్తే చంద్రబాబుని ఆయన మంచి స్నేహితుడుగానే భావించారు. ఓ విధంగా వైఎస్ ప్రోత్సాహంతో బాబు రాజకీయంగా అప్పట్లో నిలదొక్కుకున్నారనీ అంటారు. ఇక వైఎస్ కాంగ్రెస్ లో కీలకమైన స్థానంలో ఉన్నపుడే చంద్రబాబు ఆ పార్టీని విడిచిపెట్టి టీడీపీలోకి వచ్చారు.

 

 

 

తాను వద్దు అని చెప్పినా పార్టీ మారిన చంద్రబాబు మీద కొంత కోపం వైఎస్ కి ఉన్నా ఆయన ఎన్నడూ రాజకీయాలను, వ్యక్తిగతానికి ముడివేయలేదు. తాను సీఎం అయినా కూడా చంద్రబాబు విషయంలో ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే వచ్చారు.ఏ బంధాన్ని అయినా తనకు అనుకూలంగా మార్చుకుని అందలం ఎక్కడమే చంద్రబాబుకు తెలుసు. ఎన్టీయార్ అల్లుడిగా టీడీపీలో చేరి అదే పార్టీని, ముఖ్యమంత్రి సీటుని బాబు కబలించిన కధ అందరికీ తెలిసిందే.

 

 

 

లాభం ఉంటేనే కానీ ఆయన వైఎస్ పేరు కూడా తలవరని అంటారు. ఇపుడు ఆయన కుమారుడు జగన్ సీఎం. నీ తండ్రి నేను బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా అంటూ తనకు వైఎస్ తో సమానంగా గౌరవం ఇవ్వమని కోరడం ఓ రాజకీయ‌ లాభమైతే, వైఎస్సార్ సాటి వాణ్ణి అయిన తనని కొడుకు జగన్ పరాభవిస్తున్నాడని జనాలకు చెప్పుకుని సానుభూతి పొందడం మరోకటి. ఈ విధంగా ఆలోచించే ఆయన వైఎస్సార్ పేరు ని ఇపుడు ప్రస్తావిస్తున్నారనుకోవాలి. నిజంగా వైఎస్సార్ మీద అంత స్నేహ భావం పొంగిపొర్లితే పదేళ్ళ కాలంలో జగన్ ను పెట్టిన రాజకీయ వేధింపుల మాటేమిటి..? అని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కమలం గూటికి వివేక్ సోదరులు

Tags: Nettans setters on Chandrababu’s politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *