నెట్ వర్క్ ఆసుపత్రులు అలసత్వం వీడడండి

Network hospitals let go

Network hospitals let go

Date:06/12/2019

తిరుపతి ముచ్చట్లు:

ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రులు రోజువారీ రోగులనమోదు వారి వ్యాదుల వివరాలు అందించడంలో అలసత్వం వహిస్తున్నారని, మలేరియా, డెంగ్యూ , విష జ్వరాలు నమోదు తెలిస్తే ఆప్రాంతంలో పారిశుధ్యం మెరుగు పరచి తక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం వుంటుందని జిల్లాకలెక్టర్  డా.భారత్ గుప్తా అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక స్విమ్స్ ఆసుపత్రిలో డా.వై.ఎస్.ఆర్.ఆరోగ్యశ్రీ లో రోగులకు ఆర్థిక సహాయం పెంచడం,  సీజనల్ వ్యాదుల నియంతరణ, లింగ వివక్షత నిర్మూలన వంటి అంశాలపై జిల్లాలోని అన్ని ప్రభుత్వ , ప్రవేట్ ఆసుపత్రుల డాక్టర్లతో  సమీక్ష జిల్లాకలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రవేటు, ప్రభుత్వ , నెట్ వర్క్  ఆసుపత్రులు జిల్లాలో  64 వుంటే రోజువారీ వ్యాదుల నమోదు  వివరాలు పలుమార్లు అడిగినా ఇంకా 30 శాతం ఆసుపత్రులు స్పందించక పోవడం మంచి పద్దతికాదని మీకు లైసెన్సు ఇచ్చినపుడే విధి విధానాలు అందులో వున్నాయని అన్నారు. పత్రికల్లో ప్రతిరోజూ డెంగ్యూ , సీజనల్ వ్యాదులపై వార్తలు వస్తున్నాయని మీవద్ద నమోదు అయిన రోగుల వ్యాదులు వివరాలు మాకు అందితే పారిశుద్యం మెరుగుపరచలా, గర్భిణీ పోషకాలు లోపమా తెలిసే అవకాశం వచ్చి ఆ ప్రాంత ఎ.ఎన్.ఏం., పిహెచ్ సి డాక్టర్లు చర్యలు తీసుకోవడానికి అవకాశం కలుగుతుందని అన్నారు.

 

 

 

 

 

 

 

 

కలెక్టరుగా అందులో డాక్టర్ వృత్తి నుండి వచ్చిన నాకు  జిల్లా ఆరోగ్య పరిస్తితి తెలియాలంటే డాటా వుండాలి కదా అన్నారు. డా.వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీలో పింఛను, ఆర్థిక చేయూత కోసం  తలసేమియా మేజర్ , సికిల్ సెల్ వ్యాధి ,తీవ్రమైన హీమోఫిలియా , ద్వైమాసిక ఎలిపాటిసిస్ , పక్షవాతం వ్యక్తిని వీల్ ఛైయిర్ లేదా బెడ్, తీవ్రమైన కండర డిస్ట్రోఫీ , డయాలసిస్ పై లేని దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, సోనో గ్రాఫిక్ విలీనం చిన్న కాంట్రాక్ట్ కిడ్నీస్ , కుష్టు వంటి   వివరాలను మీకందించిన ప్రోఫార్మాలో పూర్తిచేసి ఇవ్వాలని సూచించారు. అలాగే మీరు పనిఒత్తిడి వల్ల రోజూవారి వివరాలు అందించలేమని వాదన సరికాదని, సీజనల్ వ్యాదులు ప్రభల కుండా నియంత్ర అనేది  పారిశుద్యంపై ఆధారపడి వుంటుందని ఈ విషయం డాక్టర్లగా మీరు గమనించాలని అన్నారు. తరచూ పెద్ద ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారని ఆరోపణలు వున్నాయని అన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ పృద్వితేజ్ యాప్ రూపకల్పన చేస్తున్నారని అందుబాటులోకి వచ్చిన వెంటేనే నమోదు చేస్తుండాలని సూచించారు. ప్రవేటు, నెట్ వర్క్  ఆసుపత్రులు డాక్టర్లు కలెక్టర్ వివరిస్తూ ప్రజలు అవగాహన లేక మెడికల్ షాపుల్లో  డాక్టర్ల చీటీలు లేకుండా మందులు వాడటం, స్వయంగా రోగులే అనుమతి లేని లాబ్ లల్లో రక్త పరీక్షలు చేసుకోవడం, తీవ్రస్థాయికి చేరిన తరువాత ఆసుపత్రులకు రావడం జరుగుతున్నదని తెలిపారు.

 

 

 

 

 

 

 

అవగాహన లేక  డాక్టర్లపై దాడులు వంటివి చోటుచేసుకుంటున్నాయని కలెక్టర్ కు వివరించారు. రుయాలో ప్రత్యేకంగా ఫీవర్ సెల్ 100 పడకలతో ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు విన్నవించారు. జిల్లా కలెక్టర్ హామీ ఇస్తూ మీసమస్యలపై ఒక్కరోజు గెట్ తు గెధర్ నిర్వహిస్తామని మరింత మెరుగైన వైద్య సేవలందించే దిశగా అడుగు వేద్దామని సూచించారు. రుయా, ప్రసూతి ఆసుపత్రుల సూపరింటెండ్ లు ఆరోగ్యశ్రీ ద్వారా  రోగులుకు అందిస్తున్న సేవలు, వారికి ప్రస్తుతం అందిస్తున్న పరిహారం వివరాలు తెలిపారు. ఈ సమావేశంలో డీఎంహెచ్వో, డా.పెంచలయ్య, డీసీహెచ్ ఎస్, డా. సరలమ్మ, ఎడిడిఎస్ డీఎంహెచ్ వో (ఏఅండ్ ఎల్), డా. అరుణసూలోచనాదేవి, మెడికల్ సూపరింటెండెంట్, రుయా ఆసుపత్రి డా. రమణయ్య, , మెడికల్ సూపరింటెండెంట్, జీహెచ్ ఎంసీ డా. భారతి,  జిల్లా సమన్వయకర్త, ఆరోగ్యశ్రీ, డా. బాలఆంజనేయులు, డా. రవిరాజు ఐఎంఏ ప్రెసిడెంట్ తిరుపతి ,  డా. యుగంధర్, ఐఎంఏ సెక్రటరీ, డా. నిరంజన్ రెడ్డి, ఐఎంఏ, ప్రెసిడెంట్, చిత్తూరు డా.నారాయణరెడ్డి, ఐఎంఏ సెక్రటరీ, చిత్తూరు, డా. ప్రభాకర్, ఐఎంఏ, గత అధ్యక్షుడు, మదనపల్లి, డా. హనుమంతరావు, డీఈఓ, డా. రమాదేవి  జిల్లాలోని అన్ని ప్రవేటు ఆసుపత్రుల నిర్వహణ డాక్టర్లు హాజరయ్యారు.

 

రిలయన్స్ సంస్థ ట్రెండ్‌ షోరూమ్‌ను ప్రారంభించిన కొండవీటి నాగభూషణం

 

Tags:Network hospitals let go

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *