దేశంలో కొత్తగా 65 వేల పెట్రోల్ బంకులు

New 65,000 petrol pumps in the country

New 65,000 petrol pumps in the country

 Date:26/11/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. కొత్తగా 65,000 పెట్రోల్‌ బంకులను నెలకొల్పడానికి ప్రభుత్వరంగ చమురు సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా 55,459 కొత్త పెట్రోల్‌ బంకులను ఏర్పాటుకు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌లు ఆదివారం (నవంబరు 25) ప్రకటనలు కూడా జారీ చేశాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాలను దీన్నుంచి మినహాయిస్తున్నట్లు.. హెచ్‌పీసీఎల్‌ రాష్ట్రస్థాయి సమన్వయకర్త విశాల్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. అయితే ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లోనూ మరో 9,000 – 10,000 బంకులను ప్రారంభించే అవకాశం ఉందని.. వీటితో కలిపి కొత్తగా ఏర్పాటయ్యే పెట్రోలు బంకుల సంఖ్య 65,000 వరకు చేరవచ్చని ఆయన అన్నారు. ఎన్నికల అనంతరం ఆయా రాష్ట్రాల్లో పెట్రోలు బంకులను ఏర్పాటు చేయనున్నారు. కొత్త పెట్రోలు బంకుల ఏర్పాటు వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు వేల కోట్ల రూపాయల్లో పెట్టుబడులకు అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 63,674 పెట్రోలు బంకులు ఉన్నాయి. వీటిలో కేవలం 6,411 బంకులు మాత్రమే ప్రైవేట్ సంస్థలకు చెందినవి కాగా.. మిగతావి ప్రభుత్వరంగ సంస్థలకు చెందినవే ఉన్నాయి. ప్రైవేట్ భాగస్వామ్యంలో ఎస్సార్ ఆయిల్ లిమిటెడ్‌కు 4,895 బంకులు, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 1,400 బంకులు, రాయల్ డచ్/ షెల్ సంస్థకు 116
బంకులు ఉన్నాయి. ఆయిల్ సంస్థ ప్రస్తుత బంకులు కొత్త బంకులు ఐఓసీ 27,377 26,982, బీపీసీఎల్‌ 14,592 15,802, హెచ్‌పీసీఎల్‌ 15,287 12,865, ఏపీలో కొత్తగా 2,814 పెట్రోలు బంకులను ఏర్పాటుచేసేందుకు ప్రకటన జారీ చేసినట్లు ప్రభుత్వరంగ ఆయిల్‌ కంపెనీల రాష్ట్ర సమన్వయకర్త ఉమాశంకర్‌ తెలిపారు. ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, డిసెంబరు 24 తుది గడువు అని తెలిపారు. రీటైల్‌ అవుట్‌లెట్ల డీలర్ల ఎంపిక విధానాన్ని సరళీకృతం చేశామన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
Tags:New 65,000 petrol pumps in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *