జూ పార్క్ లో కొత్త జంతువులు

హైద్రాబాద్ ముచ్చట్లు :
హైదరాబాద్ జూపార్కులో కొత్త జంతవులు కనువిందు చేస్తున్నాయి. ఇటీవల జన్మించిన కొత్త ప్రాణులు ఆకట్టుకుంటున్నాయి. శనివారం జూపార్కులో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా రెండు కూనలకు నామకరణం చేశారు జూ అధికారులు. 15 రోజుల క్రితం జూలో క్రితం ఖడ్గమృగం జన్మించింది. ఈ నెల 2న అడవి దున్న పిల్ల జన్మించింది. వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన వాటికి శనివారం జరిగిన కార్యక్రమంలో నామకరణం చేశారు.అడవి దున్నకు ‘కొమరం భీమ్‌’ అని యోధుడి పేరుపెట్టారు జూ అధికారులు. ఖడ్గమృగానికి ‘నంద’ అని నామకరణం చేశారు. అనంతరం వాటికి కేటాయించిన ఎన్‌క్లోజర్లలో తల్లుల వద్ద వదిలిపెట్టారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు ఆర్‌.శోభ ఆర్‌.ఎం దొబ్రియాల్‌, సిధానంద్‌ కుక్రెట్టి, ఎంజే అక్బర్‌, క్యూరేటర్‌ వీవీఎల్‌ సుభద్రాదేవి, డిప్యూటీ డైరెక్టర్‌ (వెటర్నరీ) డాక్టర్‌ ఎం.ఏ హకీం, డిప్యూటీ క్యూరేటర్‌ ఎ.నాగమణి, పీఆర్‌ఓ హనీఫుల్లా పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:New animals in the zoo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *