భద్రతా ప్రమాణాలతో నూతన పాసుపుస్తకాలు

Date:12/02/2019
నల్లగొండ ముచ్చట్లు:
భూమి సమస్య అంటేనే ఇప్పడు కాదులే అన్న భావన నుంచి.. పట్టాదారుల వద్దకే నేరుగా జిల్లా యంత్రాంగం వెళ్లి సమస్యలు పరిష్కరించి.. 18 రకాల భద్రతా ప్రమాణాలతో నూతన పాసుపుస్తకాలను అందజేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2, 59, 000 ఖాతాలలో పాసుపుస్తకాలున్నట్లు అధికారులు గుర్తించారు. 16 మండలాలకు సంబధించి ఇప్పటికే ఎనిమిది విడుతల్లో మొత్తం 1,61,793 ఖాతాలకు పాసుపుస్తకాలు మంజూరు చేశారు. ఇంకా 50,000 ఖాతాలకు సంబంధించి పాసుపుస్తకాలు మంజూరు చేయాల్సి ఉన్నదని అధికారుల చెబుతున్నారు. వీటిలో 17,000 పాసుపుస్తకాలు రావాల్సి ఉండగా 9వ విడుతలో 7343 పాసుపుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. అన్ని రకాల భూ సమస్యలకు చమరగీతం పాడుతూ ప్రభుత్వం అంకురార్పణ చేసిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ఎంతో మేలు చేకూరుస్తుందని భూ పట్టాదారులకు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2014 సంవత్సరంలో జూన్ 2న అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ప్రతి విషయంలోనూ పారదర్శకత ఉండాలనే సంకల్పంతో అడుగులు వేస్తూ వస్తున్నది.  భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని 2017 సంవత్సరంలో అక్టోబర్‌లో తెలంగాణ ప్రభుత్వం అంకురార్పణ చేసింది. భూమి ఎంత ఉన్నదో పాసుపుస్తకాలలో అంతే ఉండాలంటూ పూర్వపు రికార్డులను బహిర్గతం చేస్తూ ప్రతిరికార్డును పరిశీలించి, 18 రకాల భద్రతా ప్రమాణాలతో నూతన పాసుపుస్తకాలను అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రధాన సమస్యలు అన్ని రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్నవి అన్ని పరిష్కరిస్తూ అధికారులు ముందుకు సాగుతున్నారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూశాఖ పరిధిలో ఉన్న భూ సమస్యల లెక్క తేల్చి అర్హులైన వారందరికీ పాసుపుస్తకాలను అందజేసేందుకు అధికారులు మరోఅడుగు ముందుకేసి ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.
వారం రోజుల్లోపే భూ సమస్యలు జిల్లాలో పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యే అవకాశలున్నాయి.జిల్లా వ్యాప్తంగా భూమి 2, 59, 000, ఖాతాలలో ప్రజల భూములు ఉన్నాయని అధికారులు తేల్చారు. ఈ క్రమంలో వివిధ సమస్యల పరిధిలో ఉన్న 50,000 ఖాతాల్లోని భూములను ఫాం-బీ పరిధిలో ఉంచారు. ఈ క్రమంలో పీవోటీ తదితర సమస్యలున్న భూముల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తూ తుది నివేదికలను జారీ చేయాలని జిల్లా ఉన్నతాధికారులు మండల అధికారులకు తెలిపారు. నిర్లక్ష్యానికి తావు లేకుండా రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నూతన పాసుప్తుకాలను అందజేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఫాం-బీ పరిధిలో ఉన్న భూ సమస్యలను మండలాధికారుల పరిగణలోకి తీసుకుంటూ ఆయా గ్రామాల్లో ప్రత్యేక విచారణ చేసి అర్హులైన వారికి నూతన పాసుప్తుకాలను అందజేయనున్నారు. దీంతో యేండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభించే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు నూతన పాసుప్తుకాల పంపిణీ కార్యక్రమాన్ని మరింత త్వరగా భూ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ముగింపు పలికే అవకాశాలున్నాయి. కేవలం కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం మరింత సమయం పట్టే అవకాశం ఉన్నది. మండలాధికారులకు 7,343 జిల్లా కలెక్టర్‌లో సంబధిత అధికారులు అందజేశారు. వచ్చిన నూతన పాసుప్తుకాలు జిల్లాకు చేరడంతో అధికారులు మంజూరైన పాసుపుస్తకాలను భూ పట్టాదారులకు అందజేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఫాం- బీ పరిధిలోని భూముల సమస్యలు పరిష్కారం కాగానే వారికి ప్రత్యేకంగా అందించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగానే నిర్వహిస్తున్నది.
Tags:New booklets with safety standards

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *