గురజాల మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ ప్రమాణ స్వీకారం
-హజరయిన మంత్రి రజని
పల్నాడు ముచ్చట్లు:
పల్నాడు జిల్లా గురజాల మార్కెట్ యార్డ్ లో మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని పాల్గొన్నారు. అనంతరం మంత్రి రజని మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర రాష్ట్రం అభివృద్ధిలో కానీ విని ఎరుగని రీతిలో ముందుకి దూసుకుపోతుందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చేయలేని పనిని వైసిపి పార్టీ ముందుకు తీసుకు పోతున్నామని చూసి టిడిపి ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గురజాల నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి అన్న గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీర్చి దిద్దుతున్నారని అన్నారు. ఈరోజు ఒక దళితుడికి కనివిని ఎరుగని రీతిలో చరిత్ర లో లేని విధంగా గురజాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.

Tags: New Chairman of Gurjala Market Yard takes oath
