పౌర సరఫరాల పంపిణీలో కొత్త ఆధ్యాయం

Date:21/01/2021

విశాఖపట్నం ముచ్చట్లు:

పౌరసరఫరాల పంపిణీ లో నూతన అధ్యాయనం ప్రారంభమైందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో రేషన్ వాహనాలను జిల్లా ఇంచార్జి మంత్రి కన్నా బాబు సమక్షం లో ప్రారంభించారు.ఇంటి వద్దకే ఈ వాహనాల ద్వారా నాణ్యమైన బియ్యం, రేషన్ సరఫరా జరుగుతుం దని చెప్పారు.మొత్తం 828 వాహనాలు ఉన్నాయని మంత్రి కురసాల అన్నారు. అవినీతికి అవకాశం లేకుండా అన్ని వాహనాలకు ట్రాకింగ్ సౌకర్యం ఉందని పేదలకు మంచి రకమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.రెండు నెలలుగా ఈ పథకం అమలు కోసం కసరత్తు చేశామని ఈ పథకం వల్ల 828 మందికి ఉపాధి దక్కిందని అన్నారు.అర్హత ఉండి రేషన్ కార్డు లేని వారికి వారం రోజుల లోపు కార్డు వచ్చేలా చర్యలు చేపట్టారని జిల్లాలో 12 లక్షల మంది పేద ప్రజలకు, 828 నిరుద్యోగులకు, లబ్ది చేకూర్చే పథకం ఉందని చెప్పారు. సంచార వాహనం ద్వారా సరుకుల పంపిణీ రాష్ట్రంలో మొదటి సారి చేస్తున్న ఘనత మన మఖ్యమంత్రికి దక్కిందని,తన ఎన్నకల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను 100% నేరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు.ఇవన్నీ చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నా యను జగన్మోహన్ రెడ్డి పాలన ఇలా ఉంటుంది అని చంద్రబాబు ఊహించలేదని చెప్పారు.

పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన

Tags: New chapter in the distribution of civilian supplies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *