వాణిజ్య శాఖకు  కొత్త సొబగులు

Date:16/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఆదాయ వనరుగా ఉన్న  వాణిజ్య శాఖను ఆధునీకరించేందుకు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వాణిజ్యశాఖలో మౌలిక సదుపాయాలు పటిష్ఠం చేసేందుకు రూ.5కోట్లు, చెక్‌పోస్టుల ఆధునీకరణకు కోటి, చెక్‌పోస్టుల నిర్మాణం, ఇతర సదుపాయాలకు రూ.2.25కోట్లు, జిఎస్‌టిపై సిబ్బందికి శిక్షణ, కొత్త సాఫ్ట్‌వేర్‌కు రూ.5కోట్లను రాష్ట్రం 2017-18లో కేటాయించింది.  వచ్చే ఏడాది రాష్ట్రంలో అమ్మకం పన్నుల ద్వారా రూ. 46,500 కోట్లు వస్తాయని అంచనా వేసింది. 2015- 16లో రూ.29,846.91 కోట్లు, 2016-17లో రూ.37,439.97 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఈ శాఖలో అన్ని హంగులు ఏర్పాటు చేయడానికి రోడ్ మ్యాప్‌ను ఖరారు చేశారు. చెక్‌పోస్టులను ఆధునీకరించాలి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, నిఘా విభాగానికి సహాయపడేందుకు హోంగార్డులను ఏర్పాటు చేయాలని, లెక్కలు సరిచూసేందుకు వాణిజ్య ప న్నుల డాటాబేస్‌ను ప్రభుత్వం డాటాబేస్‌ను అనుసంధానిస్తారు. లీజు లావాదేవీలపై పన్ను మినహాయింపు అట్ సోర్స్ యంత్రాంగాన్ని నియమించనున్నారు. అమ్మకం పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు అదనపు బ్రాంచిని ఏర్పాటు చేస్తారు. డివిజన్, సర్కిల్ కార్యాలయాలకు తగిన వౌలిక సదుపాయాలను నిర్మిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు ఏకీకృత చెక్‌పోస్టులు, ఐదు సరిహద్దు చెక్‌పోస్టులు ఉన్నాయి. కొత్తగా ఏడు కొత్త సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. రెండు చెక్ పోస్టులు ముఖ్యమైన సరిహద్దు ట్రాఫిక్ జంక్షన్లలో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా సాలూరులో, ఆదిలాబాద్ జిల్లా బోరజ్‌లో రెండు ఏకీకృత చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కోదాడ, విష్ణుపురం, నాగార్జునసాగర్, గద్వాల్, కొత్తగూడెం, ఖమ్మం-1, అశ్వారావుపేట వద్ద కొత్తగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. జిఎస్‌టి అమలుకోసం నెట్‌వర్క్, సెక్యూరిటీ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్లు వాణిజ్య పన్ను శాఖ పద్దుల్లో ప్రభుత్వం పేర్కొంది. జిఎస్‌టిపై ఇంతవరకు రాష్ట్రప్రభుత్వం 836 మందికి, 795 మంది అధికారులకు శిక్షణ ఇచ్చారు.
Tags: New commerce to the Department of Commerce

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *