డిసెంబర్ తర్వాత కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులే

New debit and credit cards are after December

New debit and credit cards are after December

Date:12/10/2018
ముంబై  ముచ్చట్లు:
ఏటిఎం కార్డును తక్షణమే మార్చుకోవాలంటూ బ్యాంకుల నుంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయా? అయితే మీరు ఈ సందేశం ఎందుకు పంపిస్తున్నారో తెలుసుకోండి. ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) 2015 నోటిఫికేషన్ ప్రకారం, పాత డెబిట్, క్రెడిట్ కార్డుల స్థానంలో చిప్ ఆధారిత కార్డులను తీసుకోవాలి. ఆర్‌బిఐ ఆదేశాల మేరకు అన్ని బ్యాంకులూ తమ ఖాతాదారుల డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులను అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. అది కూడా అదనపు చార్జెస్ ఏమీ లేకుండా పూర్తి ఉచితంగానే ఈ సేవలను అందిస్తున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ ఆఖరు లోగా అన్ని బ్యాంకులూ కార్డుల అప్ గ్రెడేషన్ పూర్తి చేయా ల్సి ఉంది. ఇంతకుముందున్న కార్డులకు మ్యాగ్నెటిక్ స్ట్రైప్ మాత్రమే ఉండేది.
ఇప్పుడు వాటి స్థానంలో ఇఎంవి చిప్ కార్డులును ఇవ్వనున్నా రు. ఇఎంవి అంటే యూరోపే, మాస్టర్ కార్డ్, వీసా. మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డులు.. అయితే వీటి కన్నా ఇఎంవి చిప్ అండ్ పిన్ కారడ్స్ మరింత సురక్షితమైనవి. అందుకే ఆర్‌బిఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈఎంవీ కార్డుతో స్వైప్ చేశాక కూడా పిన్ అడుగుతుంది. దీంతో కార్డుకు రెండింతల భద్రత దక్కుతుందని భావించి ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది.2015 లో ఆర్‌బిఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఇప్పటికే ఉన్న అన్ని డెబిట్ మరియు క్రెడిట్ కార్డు హోల్డర్లు మార్పులను చేపట్టాలి.నోటిఫికేషన్ ప్రకారం, అన్ని డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు చిప్ ఆధారంగా ఉండాలని ఆర్బిఐ పేర్కొంది.
అవి ఇఎంవి డెబిట్ / క్రెడిట్ కార్డ్ అని అంటారు. వీటిని ’చిప్ ఎన్ పిన్’ కార్డులని కూడా పిలుస్తారు.ప్రస్తుతం ఉపయోగించే డెబిట్, క్రెడిట్ కార్డులలో ఎక్కువ భాగం మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులు మాత్రమే.. ఇవి అంతగా భద్రత ప్రమాణాలను కల్గిలేవు. మీ వద్ద ఉన్న మాగ్నెటిక్ స్ట్రిప్ డెబిట్, క్రెడిట్ కార్డులు డిసెంబర్ 31 తర్వాత పనిచేయవు. వీటి స్థానంలో 2018 డిసెంబర్ 31కి ముందు ఈఎంవి చిప్ ఆధారిత కార్డులకు మారాల్సి ఉంటుంది. సమీపంలో ఉన్న బ్యాంకు శాఖను సందర్శించి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి.
Tags:New debit and credit cards are after December

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *