చంద్రబాబు హౌస్ రిమాండ్ పేరుతో కొత్త నాటకం- ఎంపి మార్గాని
రాజమండ్రి ముచ్చట్లు:
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయు డుకు ప్రాణ హాని ఉందంటూ టీడీ పీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. రాజమ హేంద్రవరం సెంట్రల్ జైలుకు అత్యంత సెక్యూరిటీ ఉందదని వెల్లడించారు.ఇక చంద్ర బాబుకు వీవీఐపీ కంటే అంత్యత సెక్యూరిటీ కల్పించిన ట్లు జైలు సూపరింటెండెంట్ ఇప్పటికే నివేదిక ఇచ్చార ని చెప్పుకొచ్చారు. జైలులోనే చంద్రబాబుకు భద్రత ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు.ప్రభుత్వం చం ద్రబాబుకు కావా ల్సిన ప్రతీ సౌకర్యాన్ని కల్పించిందని ఎంపీ భరత్ వెల్లడించారు. చంద్రబాబు హౌస్ రిమాం డ్ పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డా రు. జైలు నుంచి బయటకు వచ్చేందుకే హౌస్ రిమాండ్ పిటిషన్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విరుచుకు పడ్డారు.
Tags: New drama titled Chandrababu House Remand- MP Margani

