రేషన్ కార్డులకు కొత్త విధి విధానాలు

హైదరాబాద్    ముచ్చట్లు:

రేషన్ కార్డుల జారీకి కొత్త విధి విధానాలు రూపొందిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొత్త కార్డుల జారీతోపాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో  మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ నివేదిక  ఇస్తామన్నారు.రేషన్ కార్డులో పేర్లు ఆడిషన్, డిలీషన్ పై కూడా ఇవాళ సబ్ కమిటీ చర్చిందని, వీటన్నింటిపై సీఎం కేసీఆర్ నివేదిక ఇస్తామన్నారు. 10 రోజుల్లో 4 లక్షల 97 వేల కార్డుల జారీపై సీఎం కేసీఆర్ తుది నివేదిక ఇస్తున్నామని, డీలర్లకు కమిషన్ పెంచాలని ఎప్పటి నుండో అడుగుతున్నారని, దానిపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చే అంశంపై కూడా సీఎం కేసీఆర్ కు ప్రతిపదిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా 1498 రేషన్ దుకాణాలు ఖాళీ గా ఉన్నాయని, వాటిపై కూడా చర్చించామన్నారు. డీలర్ల కమిషన్ పై కూడా సీఎం కు నివేదిక ఇస్తామని, రేషన్ కార్డులు, డీలర్లకు సంబంధించిన అన్ని అంశాలపై త్వరలోనే సీఎం కేసీఆర్ నివేదిక సమర్పిస్తామని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

 

Tags:New duty policies for ration cards

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *