ద్వారకా తిరమలకు కొత్త ఈవో

Date:04/06/2020

ఏలూరు  ముచ్చట్లు:

భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించే తగిన చర్యలు తీసుకుంటామని ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం  ఈవో గా నూతనంగా  బాధ్యతలు స్వీకరించిన ఆర్. ప్రభాకరరావు  అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన ద్వారకాతి రుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తనకు ఇష్టమైన దైవమని ప్రతి ఏటా ఎక్కడ ఉన్నా స్వామివారి దర్శనానికి వస్తానని నూతనంగా ఈవో బాధ్యతలు స్వీకరించిన రావిపాటి ప్రభాకర్ రావు తెలిపారు ఆయన గురువారం ఉదయం 9 గంటల ఐదు నిమిషాలకు బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు.  తనది ప్రకాశం జిల్లా అని అయితే డిప్యూటీ కలెక్టర్ హోదాలో పశ్చిమగోదావరి జిల్లాలో కోనేరు రంగారావు కమిటీ కి అధికారిగా పనిచేస్తూ బదిలీపై స్వామి వారి ఆలయానికి వచ్చినట్లు ఈవో తెలిపారు జిల్లాలో పని చేసినందున దేవస్థానం పై కొంత అవగాహన ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఈవో చెప్పారు స్వామివారి ఆశీస్సులతోనే నేను ఈ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లుగా భావిస్తున్నానని తనను రాకుండా కొంతమంది అడ్డుకున్న విషయం నాకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు 29వ తేదీన తనను ద్వారకా తిరుమల దేవస్థానం  ఈ ఓ గా నిర్మించినప్పటికీ ఆదేశాలు రావటానికి జరిగిన జాప్యం వరుసగా సెలవులు రావటం టెక్నికల్ ఇబ్బందులే కారణమని దీనికి వేరే ఏమీ లేదని ఈవో ప్రభాకర్ రావు తెలిపారు బుధవారం నాడు దేవస్థానం ఈ మెయిల్ కు తన ఆర్డర్ కాపీ వచ్చిందని ఆయన చెబుతూ ఈరోజు మంచిదని బాధ్యతలు స్వీకరించిన ట్లు ఈవో ప్రభాకర్ రావు తెలిపారు.  సిబ్బంది అధికారులు పాలకవర్గం సహకారంతో దేవాలయాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకు వెళ్తానని ఆయన తెలిపారు.

పదవ తరగతి పరీక్షల నిర్వహణ కేసు శుక్రవారానికి వాయిదా

Tags: New Evo to Dwarka Tirumala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *